యూఎస్ ఓపెన్ కోర్టులోనే బట్టలు మార్చుకున్న అలైజ్ కార్నెట్!

Submitted by arun on Fri, 08/31/2018 - 11:12
Alizé Cornet

యూఎస్‌ ఓపెన్‌లో ఫ్రాన్స్‌ క్రీడాకారిణి అలిజె కార్నెట్‌ అనుకోకుండా చేసిన ఓ పని వివాదాస్పదమైంది. ఫ్రెంచ్ క్రీడాకారిణి అలైజ్ కార్నెట్, మైదానంలో తన బట్టలు మార్చుకోవడం, లోదుస్తులు పైకి కనిపించడంతో చైర్ అంపైర్ తప్పుబట్టడంపై ఇప్పుడు పెను దుమారం చెలరేగుతోంది. డబ్ల్యూటీఏ నిబంధనల ప్రకారం, మహిళలు కోర్టులో దుస్తులు మార్చుకునేందుకు వీలు లేదు. పురుషులకు ఆ నిబంధన ఏమీ లేదు. తాజాగా, కార్నెట్ వ్యవహారం మరోసారి ఈ అంశాన్ని తెరపైకి తేగా, పురుషులకు అడ్డురాని నిబంధనలు మహిళల విషయంలో ఎందుకని మాజీలు ప్రశ్నిస్తున్నారు. కార్నెట్‌, జొహన్నా లార్సన్‌ (స్వీడన్‌)తో సింగిల్స్‌ మ్యాచ్‌ మధ్యలో ఎండ తీవ్రత నుంచి ఉపశమనం కోసం పది నిమిషాలు విరామం ప్రకటించారు. ఈ సందర్భంగా కార్నెట్‌ చెమటతో తడిసిపోయిన తన షర్ట్‌ను కోర్టులోనే విప్పేసి మళ్లీ వేసుకుంది. దీన్ని గుర్తించిన చైర్‌ అంపైర్‌.. నిబంధనలు ఉల్లంఘించిందంటూ కార్నెట్‌ను హెచ్చరించారు. చైర్‌ అంపైర్‌ ఇలా హెచ్చరించడాన్ని టెన్నిస్‌ అభిమానులు తీవ్రంగా తప్పుపడుతున్నారు. ఉక్కపోతతో కార్నెట్‌ అలా చేసిందే కానీ.. ఉద్దేశపూర్వకంగా కాదు కదా అంటూ అభిమానులు సోషల్‌ మీడియా ద్వారా మండిపడుతున్నారు. మ్యాచ్‌ మధ్యలో పురుష క్రీడాకారులు షర్ట్‌ విప్పేస్తే లేని ఇబ్బంది.. క్రీడాకారిణుల విషయంలో మాత్రం ఎందుకు రాద్దాంతం చేస్తారని ప్రశ్నిస్తున్నారు.

Image result for alize cornet

English Title
Alizé Cornet hit with code violation for changing shirt on court

MORE FROM AUTHOR

RELATED ARTICLES