ఎవరికి వేసినా బీజేపీకే ఓటు వెళ్లేలా ఈవీఎంలో ప్రోగ్రామ్ : కేజ్రీవాల్ ఆరోపణ

ఎవరికి వేసినా బీజేపీకే ఓటు వెళ్లేలా ఈవీఎంలో ప్రోగ్రామ్ : కేజ్రీవాల్ ఆరోపణ
x
Highlights

ఈవీఎంల పనితీరుపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పలు సందేహాలు వ్యక్తం చేశారు. దేశంలో బీజేపీ మినహా చాలా పార్టీలకు ఈవీఎంల విధానంపై అసంతృప్తి ఉందని...

ఈవీఎంల పనితీరుపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పలు సందేహాలు వ్యక్తం చేశారు. దేశంలో బీజేపీ మినహా చాలా పార్టీలకు ఈవీఎంల విధానంపై అసంతృప్తి ఉందని కేజ్రీవాల్ అన్నారు. ఈవీఎంలపై నమ్మకం పోయిందని దేశంలో చాలా మంది ప్రజలు అంటున్నారని కేజ్రీవాల్ గుర్తుచేశారు. వీవీప్యాట్‌ల కౌంటింగ్‌ విషయంపై కూడా కేజ్రీవాల్ పలు సందేహాలు వ్యక్తం చేశారు. వీవీప్యాట్‌లను లెక్కించడం కుదరకపోతే వాటిని పెట్టి ఉపయోగం ఏమిటని కేజ్రీవాల్ ప్రశ్నించారు.

ఈవీఎంలో ఏ గుర్తుకు ఓటేసినా అది బీజేపీకి వెళ్లేలా ప్రోగ్రామ్ చేశారంటూ ఆరోపించారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీలో ఈవీఎం పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే కపిల్ సిబాల్, అభిషేక్ మనుసింఘ్వీ, అరవింద్ కేజ్రీవాల్ వంటి నాయకులు బాహాటంగా మద్దతు పలుకుతున్నారు. మరోవైపు ఎన్నికలు నిస్పక్షపాతంగా నిర్వహించడమే తమ ప్రధాన డిమాండ్ అంటున్నారు ప్రతిపక్ష పార్టీల నేతలు. ఎలాంటి పరిశీలనా లేకుండా లక్షలాది ఓటర్లు తొలగిస్తున్నారని నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. 50 శాతం వీవీప్యాట్‌ స్లిప్పులు లెక్కించాలనేది తమ డిమాండ్‌ అని చెప్పారు.

Show Full Article
Print Article
Next Story
More Stories