వచ్చే వారం కేబినెట్ పెడతా.. ఎలా ఆపుతారో చూస్తా: చంద్రబాబు

వచ్చే వారం కేబినెట్ పెడతా.. ఎలా ఆపుతారో  చూస్తా: చంద్రబాబు
x
Highlights

ఎన్నికల కమిషన్‌పై మరోసారి మండిపడ్డారు ఏపీ సీఎం చంద్రబాబు. వచ్చే వారం కేబినెట్ సమావేశం పెడతాను అధికారులను ఎలా ఆపుతారో చూస్తానన్నారు. ఈసీ అడ్డుకుంటే రాత...

ఎన్నికల కమిషన్‌పై మరోసారి మండిపడ్డారు ఏపీ సీఎం చంద్రబాబు. వచ్చే వారం కేబినెట్ సమావేశం పెడతాను అధికారులను ఎలా ఆపుతారో చూస్తానన్నారు. ఈసీ అడ్డుకుంటే రాత పూర్వకంగా ఇవ్వాలని అడుగుతానన్నారు చంద్రబాబు. ఢిల్లీలో మోడీ ఇప్పటికి నాలుగు కేబినెట్‌లు పెట్టారని, మేం పెడితే తప్పేంటని ప్రశ్నించారు చంద్రబాబు.

మరోవైపు చీఫ్ సెక్రటరీ ఎల్వీ సుబ్రహ్మణ్యంపైనా చంద్రబాబు విమర్శలు చేశారు. అన్ని రాష్ట్రాల్లో సీఎస్‌లు సీఎం దగ్గరకు వెళ్లి రిపోర్టు చేస్తారని, కానీ, ఏపీలో సీఎస్ తీరు వేరని మండిపడ్డారు. ఆయన సీఎస్‌గా 3నెలలు ఉంటారని, బిజినెస్ రూల్స్‌ను అధికారులు ఎందుకు ఫాలో అవ్వరని ఆగ్రహం వ్యక్తం చేశారు. రివ్యూలకు రమ్మని సీఎస్‌ను మేము అడుక్కోవాలా అని ఆయన ప్రశ్నించారు. ఎన్నికల నిర్వహణ వేరు,రాష్ట్ర పాలన వేరని చెప్పారు.

Show Full Article
Print Article
Next Story
More Stories