హిజ్రాలు .. వ్యాపారుల మధ్య ఆరోపణలు...కౌన్సిలింగ్‌ ఇచ్చినా మారని పరిస్ధితులు

హిజ్రాలు .. వ్యాపారుల మధ్య ఆరోపణలు...కౌన్సిలింగ్‌ ఇచ్చినా మారని పరిస్ధితులు
x
Highlights

కృష్ణాజిల్లా ఇబ్రహీంపట్నంలో హిజ్రాలు, వ్యాపారులకు మధ్య వివాదం రోజురోజుకు ముదురుతోంది. దాడుల నుంచి కౌన్సిలింగ్ వరకు వచ్చినా ఇరు వర్గాల మధ్య...

కృష్ణాజిల్లా ఇబ్రహీంపట్నంలో హిజ్రాలు, వ్యాపారులకు మధ్య వివాదం రోజురోజుకు ముదురుతోంది. దాడుల నుంచి కౌన్సిలింగ్ వరకు వచ్చినా ఇరు వర్గాల మధ్య పరిస్ధితిలో మార్పు రావడం లేదు. చిల్లర చేష్టలతో తమ వ్యాపారాలకు ఆటంకం కలిగిస్తే ఊరుకోబోమంటూ వ్యాపారులు అంటూ ఉంటే దాడులు జరగకుండా చూడాలంటూ హిజ్రాలు కోరుతున్నారు.

కృష్ణాజిల్లా ఇబ్రహీంపట్నంలో గత శుక్రవారం వ్యాపారులు హిజ్రాలకు మధ్య జరిగిన ఘర్షణ ప్రకంపనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. పరస్పర దాడులు తరువాత ప్రశాంత వాతావరణాన్ని పాడు చేసేలా వ్యవహరించవద్దంటూ ఇరువర్గాలకు కౌన్సిలింగ్ ఇచ్చారు. పోలీసులు హెచ్చరించి రెండు రోజులు కూడా గడవక ముందే దాడుల విషయం మరోసారి తెరమీదకు వచ్చింది.

అందరితో సఖ్యత కోరుకునే తాము హిజ్రాలతో ఎందుకు గొడవలు పడుతామంటున్నారు వ్యాపారులు. భిక్షాటన అంటూనే తమకు తామే ఇంత ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తున్నారని ఈ విషయంలో పోలీసులే జోక్యం చేసుకొని న్యాయం చేయాలంటున్నారు. వ్యాపారుల ఆరోపణలను హిజ్రాలు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇచ్చినంత తీసుకోవడమే తప్ప తాము ఎప్పుడు ఎక్కడా డిమాండ్ చేయలేదంటున్నారు. డబ్బు ఇవ్వకపోయిన పర్వాలేదు కాని దాడులు మాత్రం చేయవద్దంటున్నారు.

పరస్పర ఫిర్యాదులతో మరోసారి ఉద్రిక్తత చెలరేగుతుందని భావిస్తున్న పోలీసులు ఇరు వర్గాలకు మరోసారి కౌన్సిలింగ్ ఇవ్వాలని నిర్ణయించారు. ప్రశాంతతకు భంగం వాటిల్లేలా ఎవరూ ప్రవర్తించినా చట్టపరిధిలో చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. వ్యాపారులు, హిజ్రాల మధ్య తలెత్తిన ఈ వివాదం జిల్లా వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. ఈ వ్యవహారంలో మహిళా సంఘాలు కూడా జోక్యం చేసుకోవడంతో వివాదం మరింత ముదరకుండా చెక్ పెట్టేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories