థియేటర్‌యే టార్గెట్‌గా ఉగ్రవాదుల పంజా..

థియేటర్‌యే టార్గెట్‌గా ఉగ్రవాదుల పంజా..
x
Highlights

శ్రీలంక రాజధాని కొలంబోలో మరోసారి బాంబు పేలుడు సంభవించింది. ఇప్పటికే వరస బాంబు పేలుళ్లతో శ్రీలంక ప్రజలు వణికిపోతున్నారు. కాగా మరో పేలుడు సంభవించింది. ఈ...

శ్రీలంక రాజధాని కొలంబోలో మరోసారి బాంబు పేలుడు సంభవించింది. ఇప్పటికే వరస బాంబు పేలుళ్లతో శ్రీలంక ప్రజలు వణికిపోతున్నారు. కాగా మరో పేలుడు సంభవించింది. ఈ సారి ఉగ్రవాదులు సినిమా థియేటర్‌ను టార్గెట్ చేసుకున్నారు. మోటర్ బైక్‌లో పేలుడు పదార్థాలు పెట్టి పేలుడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.

శ్రీలంక చిగురుటాకులా వణుకుతోంది. ఓవైపు భద్రతా బలగాలు జల్లెడ పడుతుండగా మరోవైపు బాంబులు పేలుతూనే ఉన్నాయి. తాజాగా కొలంబోలో మరో పేలుడు సంభవించింది. స్థానిక సవోయ్ థియేటర్ వద్ద ఉగ్రవాదులు డియో బైక్‌లో బాంబులు అమర్చి పేల్చేశారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. బైక్ అనుమానాస్పదంగా పార్క్ చేసి ఉన్నప్పటికీ ఎవరూ గుర్తించకపోవడం భద్రతా లోపాన్ని స్పష్టంచేస్తోంది.

ఐసిస్ ఈసారి బహిరంగ ప్రదేశాల్లో పేలుళ్లకు ప్లాన్ చేసిందని అమెరికా నిఘా వర్గాలు శ్రీలంక ప్రభుత్వానికి సమాచారం అందించాయి. అమెరికన్ ఇంటలిజెన్స్ సమాచారం ఇచ్చినట్టుగానే బుధవారం ఉదయం 10.50గంటల సమయంలో సవోయ్ థియేటర్ ఎదుట పేలుడు సంభవించింది. పేలుడు దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. శ్రీలంకలో బాంబు పేలుళ్లకు పాల్పడిన తొమ్మిది మంది ఆత్మాహుతి దళ సభ్యుల్లో ఓ మహిళ కూడా ఉన్నట్లు ఆ దేశ రక్షణశాఖ సహాయమంత్రి రువాన్‌ విజయవర్దనే తెలిపారు. ఈస్టర్‌ సండే రోజు వరుస దాడులతో ఉగ్రవాదులు నరమేథం సృష్టించిన నేపథ్యంలో ఏప్రిల్ 22వ తేదీ అర్థరాత్రి నుంచి శ్రీలంకలో ఎమర్జెన్సీ అమల్లోకి వచ్చింది. పోలీసులు, త్రివిధ దళాలు ప్రజా భద్రతను పర్యవేక్షిస్తున్నాయి.

శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన భద్రతా సిబ్బంది విషయంలో కఠిన నిర్ణయాలు తీసుకోవాలని నిర్ణయించారు. విదేశాల నుంచి ఉగ్రవాదులకు సంబంధించిన సమాచారం అందినప్పటికీ సరైన సమయంలో తనను అప్రమత్తం చేయడంలో విఫలమైన అధికారులను పదవుల నుంచి తప్పుకోవాలని ఆదేశించారు. పోలీస్ చీఫ్, డిఫెన్స్ సెక్రటరీలకు ఉధ్వాసన పలికారు. అధ్యక్షుడు సిరిసేన, ప్రధాని విక్రమసింఘేల మధ్య ఉన్న విభేదాల కారణంగానే సమన్వయ లోపం జరిగిందని ఉగ్రవాదుల దాడికి అవకాశమిచ్చిందని స్తానిక పత్రికలు కథనాలు ప్రచురించాయి.





Show Full Article
Print Article
Next Story
More Stories