లైంగిక వేధింపులపై స్పందించిన ఐశ్వర్యరాయ్‌

లైంగిక వేధింపులపై స్పందించిన ఐశ్వర్యరాయ్‌
x
Highlights

ప్ర‌ముఖ హాలీవుడ్ నిర్మాత హార్వే విన్‌స్టీన్ సెక్స్ స్కాండల్ ఎంత దుమారం రేగిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. దీనిపై మీటూ అనే ఉద్యమం కూడా...

ప్ర‌ముఖ హాలీవుడ్ నిర్మాత హార్వే విన్‌స్టీన్ సెక్స్ స్కాండల్ ఎంత దుమారం రేగిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. దీనిపై మీటూ అనే ఉద్యమం కూడా చేప‌ట్టారు. హ్య‌ష్ ట్యాగ్‌తో మొద‌లైన‌ మీటూ ఉద్య‌మానికి చాలా మ‌ద్ద‌తు ల‌భించింది. అమెరికన్ స్టార్ హీరోయిన్ అలిస్సా మిలానో ఈ హ్యాష్‌టాగ్‌కు ఆద్యం పోసారు. హాలీవుడ్‌, బాలీవుడ్‌, టాలీవుడ్‌కి చెందిన ప‌లువురు భామ‌లు తమ చేదు అనుభవాలను 'మీటూ' అని హ్యాష్ టాగ్ చేసి ఇండ‌స్ట్రీలో జ‌రిగిన‌ ఆకృత్యాలను వివ‌రించారు. గ్లోబ‌ల్ గార్ల్ ప్రియాంక చోప్రా .. ఒక్క భారత్‌లోనే కాదు అని, ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి ఘటనలు జరుగుతుంటాయని, మహిళా శక్తిని టేకోవర్ చేయాలనుకునే పురుషుల ఆధిపత్యం ఇలాగే ఉంటుందని ఆ మ‌ధ్య వెల్ల‌డించిన సంగ‌తి తెలిసిందే. మాజీ విశ్వసుందరి ఐశ్వర్యరాయ్‌ బచ్చన్‌ సైతం దీనిపై పెదవివిప్పారు. మీటూ ఉద్యమంతో ప్రపంచవ్యాప్తంగా ప్రజలు తమ అనుభవాలను పంచుకోవడం.. మాట్లాడటం స్వాగతించదగిన పరిణామమని ఐశ్వర్యరాయ్‌ అన్నారు. ఇది ప్రపంచంలో ఏ ఒక్క ప్రాంతానికో పరిమితమైందని తాననుకోవడంలేదన్నారు.

ఓ మహిళ తనకు ఎదురైన అనుభవాల గురించి మాట్లాడటం, పంచుకోవడం దాన్ని ఇతరులు అందిపుచ్చుకోవడం అద్భుతమని వ్యాఖ్యానించారు. ఈ ఆలోచన వాణిజ్యం, సినిమా వంటి ఏ కొన్ని రంగాలకో పరిమితం కాదని.. అన్నివర్గాల వారూ దీనిపై మాట్లాడటం హర్షణీయమన్నారు. హాలీవుడ్‌ నిర్మాత హార్వీ వీన్‌స్టీన్‌ లైంగిక వేధింపుల పర్వం బట్టబయలైన అనంతరం బాధితులు చేపట్టిన మీటూ ఉద్యమానికి అనూహ్య మద్దతు లభించింది. ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి ఉదంతాలను ఈ హ్యాష్‌ట్యాగ్‌తో సోషల్‌ మీడియాలో ప్రస్తావిస్తూ అవగాహన పెంచుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories