సిని సింహాసనాదీషుడు మన సూపర్ స్టార్ కృష్ణ.

సిని సింహాసనాదీషుడు మన సూపర్ స్టార్ కృష్ణ.
x
Highlights

అగ్ని...జమదగ్ని అనగానే గుర్తుకు వచ్చే హీరో, అగ్గి పెట్టె వుందా...అనగానే గుర్తుకు వచ్చే హీరో, సాహసమే ఉపిరిగా తెలుగు సినిపరిశ్రమలో ఎన్నో విజయవతమైన...

అగ్ని...జమదగ్ని అనగానే గుర్తుకు వచ్చే హీరో, అగ్గి పెట్టె వుందా...అనగానే గుర్తుకు వచ్చే హీరో, సాహసమే ఉపిరిగా తెలుగు సినిపరిశ్రమలో ఎన్నో విజయవతమైన ప్రయోగాలూ చేసిన వ్యక్తి అనగానే గుర్తుకు వచ్చే హీరో... అత్యంత తక్కువ కాలంలో అల్లూరి సీతారామరాజు సినిమాని తెరమీదికి తెచ్చిన హీరో ...మన సూపర్ స్టార్...కృష్ణ గారు. ఈ రోజు మన సూపర్ స్టార్ కృష్ణ గారి పుట్టినరోజు. కృష్ణ గారి... పూర్తిపేరు ఘట్టమనేని శివరామకృష్ణమూర్తి, కృష్ణ అన్న పేరుతో ఫేమస్ అయ్యారు. మన సూపర్ స్టార్ సినిమా నటుడుగా, దర్శకుడుగా, నిర్మాతగా ఎన్నో విజయాలు పొందారు. కృష్ణ 1970లు, 80ల్లో తెలుగు సినిమా హీరోగా ప్రజాదరణ సాధించి ప్రజలచే...సూపర్ స్టార్‌ అని విజిల్స్ వేసేలా చేసారు.

తన సిని ప్రయాణం 1964కు ముందు పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసిన కృష్ణకు 1964-65లో హీరోగా నటించిన తొలి సినిమా "తేనెమనసులు", మూడవ సినిమా గూఢచారి 116 తో పరిశ్రమకి పర్మినేట్గా వచ్చానని చాటాడు. ఆపైన నాలుగు దశాబ్దాలకు పైగా సాగిన కెరీర్‌లో 340 పైచిలుకు సినిమాల్లో ప్రధాన పాత్రలో నటించాడు. 1970లో నిర్మాణ సంస్థను ప్రారంభించి పద్మాలయా సంస్థ ద్వారా పలు విజయవంతమైన చలన చిత్రాలు తీశాడు. 1983లో ప్రభుత్వ సహకారంతో స్వంత స్టూడియో పద్మాలయా స్టూడియో ను హైదరాబాద్‌ లో నెలకొల్పాడు. దర్శకుడిగానూ 16 సినిమాలు తీశాడు.

తెలుగులో తొలి జేమ్స్‌బాండ్ సినిమా (గూఢచారి 116), తొలి కౌబాయ్ సినిమా (మోసగాళ్ళకు మోసగాడు), తొలి ఫుల్‌స్కోప్ సినిమా (అల్లూరి సీతారామరాజు), తొలి 70 ఎంఎం సినిమా (సింహాసనం) వంటివి కృష్ణ నటించిన సినిమాలే. వీటితో పాటుగా పండంటి కాపురం, దేవుడు చేసిన మనుషులు, పాడిపంటలు, ఈనాడు, అగ్నిపర్వతం వంటి సూపర్ హిట్ సినిమాలు ఉన్నాయి. ప్రధానంగా 1976-1985 మధ్యకాలంలో కృష్ణ కెరీర్ దూసుకువెళ్ళింది అని చెప్పాలి. 1964 నుంచి 1995 వరకు కృష్ణ సగటున పదేళ్ళకు వంద సినిమాలు, అంటే ఏడాదికి 10 సినిమాల చొప్పున 300 సినిమాలు పూర్తిచేశాడు. ఇందుకోసం మూడు షిఫ్టులు చొప్పున వేగంగా సినిమాలు పూర్తిచేసేవాడు.

కృష్ణ కుటుంబ విషయానికి వస్తే... మన నేటి...సూపర్ స్టార్ మహేష్ బాబు, రమేష్ బాబు కుమారులు, కుమార్తె మంజుల, చిన్న అల్లుడు సుధీర్ బాబు సినిమా రంగంలోకి వచ్చారు. తోటి నటి అయిన విజయనిర్మలను 1969లో ప్రేమించి రెండవ పెళ్ళి చేసుకున్నాడు. కుమారుడు మహేష్ బాబు పలు విజయాలు అందుకుని ప్రేక్షకుల నుంచి సూపర్ స్టార్ అన్న తండ్రి బిరుదు పొందాడు. కృష్ణ గారు ఇలాంటి ఎన్నో పుట్టినరోజులు ఇంకా జరుపుకోవాలని ఆశిస్తున్నాము.

Show Full Article
Print Article
Next Story
More Stories