మిక్స్‌డ్‌ టాక్ సొంతం చేసుకున్న అజ్ఞాతవాసి

Submitted by arun on Wed, 01/10/2018 - 11:53
Agnyaathavaasi

పవన్‌ కల్యాణ్‌ అజ్ఞాతవాసి మూవీపై మిక్స్‌డ్‌ టాక్‌ వినిపిస్తోంది. బాగుందని కొందరు యావరేజ్‌ అని మరికొందరు చెబుతున్నారు. మొదటి రోజు సినిమా చూసేది ఎక్కువమంది ఫ్యాన్సే ఉంటారు. అయితే అభిమానులు సైతం సినిమాపై పెదవి విరుస్తున్నారు. పవన్‌-త్రివిక్రమ్‌ మార్కు మూవీయే అయినా వీళ్లిద్దరి కాంబినేషన్‌పై ఫ్యాన్స్‌‌కున్న భారీ అంచనాలను అందుకోలేకపోయిందంటున్నారు. 

అజ్ఞాతవాసి సినిమా పూర్తిగా పవన్‌, త్రివిక్రమ్‌ మార్కు మూవీ ఇది హీరో చుట్టూనే తిరిగే కథ చదరంగం ఆటలా కథ నడుస్తుంది గేమ్‌లో ఎవరు విజేతగా నిలిచారన్నది మెయిన్ ఎలిమెంట్ ఇక పురాణాలు, ఇతిహాసాల్లోని పాత్రలను పోలిన క్యారెక్టర్లు అజ్ఞాతవాసిలో ఎక్కువగా ఉన్నాయి కుటుంబం కోసం పోరాటమే అజ్ఞాతవాసి కథ.

ఇంటర్వెల్ బ్యాంగ్ సీన్స్ ఆసక్తిని క్రియేట్ చేశాయి ఇంటర్వెల్ నుంచే అసలు కథ మొదలవుతుంది ఇంటర్వెల్‌ ముందు వచ్చే ట్విస్ట్‌ ఆకట్టుకుంటుంది ఫస్ట్ ఆఫ్ లో పవన్‌ ఎంట్రీ ఆకట్టుకుంటుంది 
సెంకడాఫ్‌లో త్రివిక్రమ్‌ మార్కు కామెడీ బాగానే పేలింది అలాగే ఎమోషన్ సీన్స్ లో పంచ్ డైలాగులు కూడా సూపర్‌గా పేలాయి. ‘కొడకా కోటేశ్వరరావు’ సాంగ్‌ అయితే మెయిన్ అట్రాక్షన్‌‌గా నిలిచింది ఈ పాట థియేటర్లలో నవ్వుల పువ్వులు పూయిస్తోంది.

బాలసుబ్రమణ్యం, అభిషిక్త భార్గవగా పవన్‌ ఆకట్టుకున్నాడు ‘స్టాలిన్‌’ తర్వాత ఖుష్బూకు మరో మంచి పాత్ర దక్కింది ఇక మురళీశర్మ, రావు రమేష్‌‌లు కేవలం వినోదానికే పరిమితమయ్యారు హీరోయిన్లకు పాత్రలకు కూడా పెద్దగా ప్రాధాన్యం లభించలేదు ఆది పినిశెట్టి నటన ఫర్వాలేదనపిస్తుంది హీరో స్థాయికి తగ్గట్లు విలన్ పాత్ర లేదు అనిరుధ్ మ్యూజిక్ కి మంచి మార్కులే పడ్డాయి

అజ్ఞాతవాసి‌ మూవీ ప్లస్ పాయింట్స్‌ చూసుకుంటే ఈ సినిమాకి పవన్‌ కల్యాణ్‌ క్యారెక్టరైజేషనే మెయిన్‌ అట్రాక్షన్‌ ఇక ఇంట్రవెల్ బ్యాంగ్ సెంకడాఫ్‌లో కామెడీ అదిరిపోయాయి కొడకా కోటేశ్వరరావు పాట సినిమాటోగ్రఫీ బాగుంది ఇక ప్రొడక్షన్ వ్యాల్యూస్ బాగున్నాయ్ సాంగ్స్, పిక్చరైజేషన్ అదిరిపోయాయి.

ఇక అజ్ఞాతవాసి‌ మూవీకి ఫస్టాఫ్‌ మైనస్‌గా మారింది ఫస్ట్‌ పార్ట్‌ సాగదీసినట్లుగా ఉంది అక్కడక్కడా ‘అత్తారింటికి దారేది’ సినిమా ఛాయలు కనిపిస్తాయి అలాగే ఫ్రెంచ్ మూవీ లార్గో వించ్ సినిమా షేడ్స్ కూడా క్లియర్‌గా కనిపించాయి ఇక రొటీన్‌ స్టోరీ కూడా అజ్ఞాతవాసి‌కి మైనస్‌గా మారింది‌ ఎడిటింగ్ అయితే సినిమాకు మరో పెద్ద మైనస్ అలాగే అవసరానికి మించిన పాత్రలు సినిమాలో కనిపించాయి స్క్రీన్ ప్లే కూడా మరో పెద్ద లోపం ఓవరాల్‌గా అజ్ఞాతవాసి‌ సినిమా అభిమానులకు మాత్రమే పండగ.

English Title
Agnyaathavaasi Movie Public Talk

MORE FROM AUTHOR

RELATED ARTICLES