కోరిక తీర్చమన్నారు.. నరకం చూశా.. తట్టుకోలేక భోరున ఏడ్చా..:అదితీరావు హైదరి

Submitted by arun on Tue, 07/31/2018 - 16:16
Aditi Rao Hydari

బాలీవుడ్ నటిగా గుర్తింపు పొందిన తెలుగు అమ్మాయి అదితి రావు హైదరీ సంచలన వ్యాఖ్యలు చేసింది. తాను కూడా క్యాస్టింగ్ కౌచ్ బాధితురాలినేనంటూ ప్రకటించింది. తన బాధలు ఎవరి చెప్పుకోనూ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. పైపెచ్చు.. బాలీవుడ్‌లో నిలదొక్కుకోవడానికి చాలా కష్టాలు పడినట్టు ఆమె వెల్లడించింది. నా కెరీర్ ఆరంభంలో బాలీవుడ్‌లో ఇలాంటి సమస్య ఎదురైంది. కొందరి కోర్కెలు తీర్చలేక ఆఫర్లు వదులుకొన్నాను. నాకు ఎదురైన అనుభవాలను తట్టుకోలేక భోరున ఏడ్చిన రోజులు ఉన్నాయి. అలాంటి వాటికి లొంగక ఆఫర్లు వదులకోవడం వల్ల నాకు ఎలాంటి పశ్చత్తాపం లేదు అని అదితిరావు అన్నారు.  ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ… 2013లో అవకాశం ఇస్తానని వచ్చిన ఓ డైరెక్టర్ కాంప్రమేజ్ కావాలని చెప్పినట్లు ఆమె చెప్పింది. తాను ఏడుస్తూ వచ్చేశానని ఆమె తెలిపింది. దీంతో ఎనిమిది నెలల పాటు తనకు ఏ సినిమా దొరకలేదని, అయినా పట్టించుకోలేదని చెప్పింది. ఎవరికైనా అటువంటి అనుభవం ఎదురైతే, అవకాశాల భయంతో బయటకు చెప్పరని, కానీ, మనవద్ద టాలెంట్ ఉంటే అవకాశాలు అవే వస్తాయని, ఇటువంటి విషయాలపై నోరు విప్పాలని ఆమె కోరింది. ఇటీవల ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో సుధీర్ బాబు హీరోగా తెరకెక్కిన సమ్మోహనం సినిమాలో నటించిన అదితీరావు హైదరి మంచి హిట్ అందుకున్న సంగతి తెలిసిందే.

English Title
Aditi Rao Hydari on casting couch

MORE FROM AUTHOR

RELATED ARTICLES