భారత్ లో తగ్గుతున్న అవినీతి.. అమెరికా, చైనాలో చూస్తే..

భారత్ లో తగ్గుతున్న అవినీతి.. అమెరికా, చైనాలో చూస్తే..
x
Highlights

క్రమంగా భారత్ లో అవినీతి తగ్గుతోంది. 2018 సంవత్సరానికి ప్రకటించిన ట్రాన్‌స్పరెన్సీ ఇంటర్నేషనల్‌ ర్యాంకింగ్‌లో భారత్ స్థానం మెరుగుపడింది. 2017లో...

క్రమంగా భారత్ లో అవినీతి తగ్గుతోంది. 2018 సంవత్సరానికి ప్రకటించిన ట్రాన్‌స్పరెన్సీ ఇంటర్నేషనల్‌ ర్యాంకింగ్‌లో భారత్ స్థానం మెరుగుపడింది. 2017లో భారత్‌ ర్యాంకింగ్‌ 81 ఉండగా తాజాగా 3 స్థానాలు మెరుగుపడి 78వ స్థానంలో నిలిచింది. వాస్తవానికి 2016లోనే భారత్ 79వ ర్యాంక్ ను సాధించింది. గత ఏడాది 40 పాయింట్లు సాధించిన భారత్‌ తాజాగా 41 పాయింట్లు సాధించింది. ప్రపంచ సగటు పాయింట్లు 43కు మనదేశం 2 పాయింట్ల దూరంలో ఆగిపోయింది. ఇదే క్రమంలో పొరుగు దేశం చైనాలో అవినీతి స్వల్పంగా పెరిగింది.

77 పాయింట్లు ఉన్న చైనా 87వ ర్యాంకుకు పడిపోయింది. అలాగే అగ్రదేశం అమెరికాలో సైతం అవినీతి పెరిగిపోతోంది. 2017లో 75పాయింట్లతో 16వ ర్యాంకులో ఉన్న అమెరికా ఇప్పుడు 71పాయింట్లతో 22వ స్థానానికి దిగజారింది. ఇక ఎప్పటిలాగే అవినీతితో డెన్మార్క్‌, న్యూజిలాండ్‌లు ర్యాంకింగ్‌లో తొలి 2 స్థానాల్లోనే కొనసాగుతున్నాయి, ఇక దక్షిణ సూడాన్‌, సోమాలి యాలు అట్టడుగున ఉన్నాయి. ఆరోగ్యవంతమైన ప్రజాస్వామ్యం, ప్రభుత్వ రంగ సంస్థల్లో అక్రమాలను అరికట్టడం ద్వారా అవినీతిని తగ్గించవచ్చని ట్రాన్‌స్పరెన్సీ ఇంటర్నేషనల్‌ సూచించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories