శ్రీదేవికి భార‌తర‌త్న ఇవ్వాలి

Submitted by lakshman on Fri, 03/02/2018 - 11:36
Actress Sharada demands Bharat Ratna to Sridevi

బాల‌న‌టిగా తెరంగ్రేటం చేసిన శ్రీదేవి త‌న అందం - అభిన‌యంతో ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న అభిమానుల్ని సొంతం చేసుకుంది. చిన్న వ‌య‌సులోనే వెండితెర‌పై స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న న‌టిగా శ్రీదేవి సొంతం. అంత‌టి లేడి సూప‌ర్ స్టార్ గా ఎదిగిన శ్రీదేవి దుబాయ్ లో మ‌ర‌ణించారు. బోనీ క‌పూర్ మేన‌ళ్లుడి పెళ్లికి వెళ్లిన శ్రీదేవి దుబాయ్ లో జుమేరా ఎమిరేట్స్ హోట‌ల్ బాత్రూంలో ప‌డి క‌న్నుమూశారు.  
 అయితే ఆమె మృతిపై  ఎన్నో అనుమానాలు ఉన్నాయని దుబాయ్ పోలీసులు రెండు రోజులు విచారణ జరిపి.. ప్రమాద వశాత్తు బాత్ రూమ్ టబ్ లో పడి ఊపిరి ఆడక చనిపోయిందని సర్టిఫై ఇచ్చి భారత్ పంపారు.  వేలాది అభిమానులు, సినీ సెలబ్రెటీలు ఆమె అంత్యక్రియలకు హాజరయ్యారు. .
ఈ నేప‌థ్యంలో చెన్నైలోని ఆంధ్రా సోషల్‌ అండ్‌ కల్చరల్‌ అసోసియే షన్‌ (ఆస్కా)  శ్రీదేవికి నివాళుల‌ర్పించింది. ఈ సంస్మ‌ర‌ణ‌కి ముఖ్య అతిదిగా హాజ‌రైన సీనియ‌ర్ న‌టి శార‌ద ..,శ్రీదేవికి భారతరత్న ఇవ్వాలని భారత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు . ఈ సంద‌ర్భంగా శ్రీదేవి క‌లిసి ప‌నిచేసిన రోజుల‌న్ని గుర్తు చేసుకున్నారు. స్టార్ హీరోయిన్ గా ఎదిగినా..ఎక్క‌డా త‌న ద‌ర్పాన్ని చూపించ‌లేద‌ని..అంత‌టి గొప్ప న‌టి శ్రీదేవి అని కొనియాడారు.  తాను వయసులో మాత్రమే శ్రీదేవి కంటే పెద్దదానినని, నటన సహా మిగతా విషయాల్లో ఆమె కంటే తాను తక్కువేనని పేర్కొన్నారు. షూటింగ్ జరిగే సమయాల్లో కూడా శ్రీదేవి చాలా సౌమ్యంగా ఉండేదని..తాను స్టార్ హీరోయిన్ అన్న గర్వం ఎక్కడా ఉండేది కాదని ఆమె గుర్తు చేశారు.    ఆమెకు భారతరత్న దక్కితే ఆ అవార్డుకే అందం వస్తుందని శారద అన్నారు.  శ్రీదేవి ఆత్మకు శాంతి కలగాలని, ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాడ సంతాపాన్ని తెలియచేస్తున్నానని అన్నారు. 

English Title
Actress Sharada demands Bharat Ratna to Sridevi

MORE FROM AUTHOR

RELATED ARTICLES