తన బికినీ పిక్‌ని విమర్శించిన వారిపై సమంత కౌంటర్

Submitted by arun on Sat, 02/10/2018 - 11:52
samantha

టాలీవుడ్‌ హీరో నాగచైతన్యను ప్రేమ వివాహం చేసుకొని అక్కినేని వారి కోడలైన సమంత నెటిజన్లపై మండిపడ్డారు. వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ కాస్త తీరిక దొరికిందని సమయాన్ని వృధా చేయకుండా ఆస్వాదిస్తున్నాని సోషల్‌ మీడియాలో అభిమానులతో పంచుకున్నారు. దీనికి సమంత తమిళనాడులోని తెన్‌కాశీలో బికినీ వేసుకుని సేద తీరుతోన్న ఫొటోను పోస్ట్‌ చేశారు.  ‘చాలా అలసిపోయాను. ఇది వెకేషన్‌ టైమ్‌. ఇది కావాలని కాదు, అవసరం’  అంటూ  పేర్కొన్నారు.

అయితే ఈ ఫొటోలో ఆమె వేసుకున్న డ్రస్ పట్ల కొందరు అక్కినేని అభిమానులు అభ్యంతరం చేస్తూ.. విమర్శలు గుప్పించారు. ఈ విమర్శలను సమంత తిప్పికొడుతూ.. మరోసారి తన ఇన్‌స్టాగ్రమ్‌లో సంచలన పోస్ట్ చేసింది. ‘‘ఓకే.. నేనిప్పుడు ఒక సందేశం ఇవ్వాలనుకుంటున్నాను. ఎందుకంటే నా గత పోస్ట్ ఏమంత అసభ్యకరంగా లేదు. ‘నా రూల్స్ నేను రాసుకుంటాను. మీరు కాదు రాయాల్సింది. మీ రూల్స్ మీరు రాసుకోండి’..’’ అంటూ సమంత చేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.

English Title
Actress Samantha counter attack on Netizen over Bikini Picture

MORE FROM AUTHOR

RELATED ARTICLES