ఆ అధికారులపై వేటుకు రంగం సిద్ధం

ఆ అధికారులపై వేటుకు రంగం సిద్ధం
x
Highlights

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల అనంతరం జరిగిన సంఘటనలకు కారకులైన అధికారులపై చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతూ రాష్ట్ర ఎన్నికల సంఘం కేంద్ర ఎన్నికల సంఘానికి...

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల అనంతరం జరిగిన సంఘటనలకు కారకులైన అధికారులపై చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతూ రాష్ట్ర ఎన్నికల సంఘం కేంద్ర ఎన్నికల సంఘానికి సిఫార్సు చేసింది. అలాగే ఎన్నికల్లో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించి, పలు పార్టీలకు ఫేవర్ గా చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులపై వేటుకు రంగం సిద్ధమవుతోంది. ఈ మేరకు సీఈసీకి నివేదిక వెళ్లింది. ఇవాళో రేపో ఆదేశాలు కూడా వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

పోలింగ్‌ తర్వాత తలెత్తిన నాలుగు వివాదాలపై నెల్లూరు, కృష్ణా, విశాఖ జిల్లాల కలెక్టర్ల నుంచి నివేదికలు తెప్పించుకున్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. నివేదికల ఆధారంగా రాష్ట్రంలో ఐదు చోట్ల రీ–పోలింగ్‌కు కేంద్ర ఎన్నికల సంఘానికి సిఫార్సు చేసినట్లు దివ్వేది తెలిపారు. నెల్లూరు, గుంటూరు జిల్లాల్లో రెండేసి బూత్‌లు, ప్రకాశం జిల్లాలో ఒక బూత్‌కు సంబంధించి రీ–పోలింగ్‌కు సిఫార్సు చేసినట్లు గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories