సెల్ఫీ వీడియోలో కీలక విషయాలు

సెల్ఫీ వీడియోలో కీలక విషయాలు
x
Highlights

నటుడు విజయ్‌ ఆత్మహత్యకు ముందు సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. భార్య వనితతో పాటు మరో ఇద్దరు వ్యక్తులు వేధిస్తున్నారని విజయ్ ఆరోపించాడు. భార్యాభర్తల మధ్య...

నటుడు విజయ్‌ ఆత్మహత్యకు ముందు సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. భార్య వనితతో పాటు మరో ఇద్దరు వ్యక్తులు వేధిస్తున్నారని విజయ్ ఆరోపించాడు. భార్యాభర్తల మధ్య గొడవలో శశిధర్ అనే వ్యక్తి తలదూర్చాడని తెలిపాడు. కేసు ఉపసంహరించుకునేందుకు మూడు కోట్లు డబ్బు డిమాండ్ చేశారని సెల్ఫీలో చెప్పాడు విజయ్. శశిధర్‌ ప్రోద్బలంతో వనిత వేధించిందన్న విజయ్ తన చావుకు వనిత, శశిధర్, అడ్వకేట్‌లే కారణమని తెలిపాడు.

‘వాల్‌ పోస్టర్‌ సినిమా షూటింగ్‌లో వనిత నాకు పరిచయమైంది. పెళ్లైన తర్వాత ఆమె నిజస్వరూపం నాకు తెలిసింది. వ్యాపార అవకాశాల కోసం వనితను శశిధర్‌ ఉపయోగించుకున్నాడు. నా కూతురిని కూడా చూడనివ్వడం లేదు. వాళ్ల వేధింపులు భరించలేకపోయాను. వనితలాంటి వారిని వదిలిపెట్టొద్దు. డాడీ అందరికీ శిక్ష పడేలా చూడు.. ఐ లవ్‌ యూ డాడీ’ అంటూ సెల్ఫీ వీడియోలో విజయ్‌ పేర్కొన్నాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories