ఊపిరి ఉన్నంతవరకు వైఎస్‌ జగన్‌ వెంటే: పృథ్వీ

Submitted by arun on Tue, 07/31/2018 - 14:25
prajasankalpayaatra

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రజా సంకల్పయాత్రలో ప్రముఖ సినీ నటులు పృథ్వీ, విజయచందర్‌లు పాల్గొని పాదయాత్రకు సంఘీభావం తెలిపారు. వైఎస్‌ జగన్‌ 225 రోజు పాదయాత్ర పిఠాపురం నియోజకవర్గంలోని విరవ నుంచి ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ గ్రామంలో నటుడు పృథ్వీ, విజయ్‌ చందర్‌లు వైఎస్‌ జగన్‌ను కలిసారు. తన ఒంట్లో ఓపిక, ఊపిరి ఉన్నంతవరకు వైసీపీ అధినేత జగన్‌ వెన్నంటే ఉంటానని  ప్రముఖ సినీ నటుడు పృథ్వీ అన్నారు. ప్రజా సంకల్పయాత్రలో భాగంగా పిఠాపురం నియోజకవర్గంలోని విరవ గ్రామంలో జగన్‌ను పృథ్వీ, మరో నటుడు విజయచందర్‌లు కలిశారు. జగన్‌కు ప్రజల మద్దతు ఉందని పృథ్వీ అన్నారు. జగన్‌ యాత్రను ప్రజలు నీరాజనాలు పడుతున్నారని చెప్పారు. జగన్‌ ముఖ్యమంత్రైతేనే వైఎస్‌ ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు మళ్లీ అమలవుతాయని విజయచందర్‌ అభిప్రాయపడ్డారు. 
 

English Title
actor pruthvi participates ys jagan padayatra

MORE FROM AUTHOR

RELATED ARTICLES