ప్రకాష్‌రాజ్ రీల్ కేసీఆర్?

ప్రకాష్‌రాజ్ రీల్ కేసీఆర్?
x
Highlights

ప్రస్తుతం టాలీవుడ్‌లో బయోపిక్‌ల ట్రెండ్ నడుస్తోంది. ఇప్పటికే మాజీ ముఖ్యమంత్రులు ఎన్టీఆర్, వైఎస్సార్ మీద బయోపిక్స్ మొదలయ్యాయి. త్వరలో తెలంగాణ తెలంగాణ...

ప్రస్తుతం టాలీవుడ్‌లో బయోపిక్‌ల ట్రెండ్ నడుస్తోంది. ఇప్పటికే మాజీ ముఖ్యమంత్రులు ఎన్టీఆర్, వైఎస్సార్ మీద బయోపిక్స్ మొదలయ్యాయి. త్వరలో తెలంగాణ తెలంగాణ జాతిపితగా కీర్తిస్తూ సీఎం కేసీఆర్ మీద కూడా బయోపిక్ రాబోతోందని సమాచారం. కొన్నాళ్లుగా దీనిపై చర్చ సాగుతున్నా రీల్ కేసీఆర్‌ ఎవరనేది సస్పెన్స్ గా ఉంది. అయితే ప్రముఖ నటుడు ప్రకాష్‌రాజ్ కేసీఆర్‌తో ఇంటి దగ్గర, అసెంబ్లీలో ఫాలో కావడంతో కేరెక్టర్ స్టడీ చేయడానికేననే టాక్ మొదలైంది.

ఎన్టీఆర్ బయోపిక్‌కు క్లాప్ పడగానే.. కేసీఆర్ బయోపిక్ గురించి చర్చ మొదలైంది. కొద్దికాలంగా కేసీఆర్ జీవిత చరిత్రను తెరకెక్కిస్తున్నారనే ప్రచారం సాగుతోంది. అయితే ఇప్పటి వరకు హీరో ఎవరన్నదానిపై క్లారిటీ లేదు. ప్రముఖ నటుడు ప్రకాష్‌రాజ్ సీఎం కేసీఆర్‌తో కలిసి కనిపించడంతో ఆయనే రీల్ కేసీఆర్ అనే ప్రచారం మొదలైంది.

చాలా మంది దర్శకులు కేసీఆర్ బయోపిక్ ను తీయాలని ముందుకు వచ్చారు. వారిలో దర్శక నిర్మాత మధుర శ్రీధర్ రెడ్డికి అవకాశం దక్కింది. బాహుబలి రైటర్ విజయేంద్ర ప్రసాద్ సహకారంతో కథను సిద్ధం చేసుకున్న ఆయన.. కేసీఆర్ అనుమతి కోసం వేచి చూస్తున్నారు. ఈ మద్యే కేసీఆర్ కూడా ఓకే చెప్పడంతో.. కేసీఆర్ పాత్రకు తగిన నటుల కోసం దేశమంతా గాలించి చివరకు ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్టు ప్రకాశ్‌రాజ్‌ను ఫైనల్ చేసినట్టు సినీ, రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

కేసీఆర్‌తో భేటీ అయిన ప్రకాష్‌రాజ్ ఇంట్లో ఆయన బాడీ లాంగ్వేజ్ స్టడీ చేసి తర్వాత అసెంబ్లీకి వచ్చారని టాక్. కేసీఆర్ సభలో మాట్లాడినంత సేపు గ్యాలరీ నుంచి ప్రకాష్.. ఆయన హావభావాలు పరిశీలించారు. ప్రకాశ్‌రాజ్ కు రాజకీయ నేతల పాత్రలు కొత్తేం కాదు. గతంలో మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ఇద్దరు సినిమాలో డీఎంకే అధినేత కరుణానిధిగా అద్భుతంగా నటించి మెప్పించారు. దీంతో రీల్ కేసీఆర్‌గా ప్రకాశ్‌రాజ్‌ను ఓకే చేసినట్లు నడుస్తోంది.

కేసీఆర్ కూడా తన బయోపిక్ పట్ల ఆసక్తిగా ఉన్నారట. తన పాలన తీరు, తెలంగాణ సెంటిమెంట్, సంక్షేమ పథకాలను ప్రకాశ్ రాజ్ తో చెప్పించడం ద్వారా ప్రజలను ఆకట్టుకోవచ్చని కేసీఆర్ భావిస్తున్నట్టు సమాచారం. అంతా సజావుగా సాగితే ఎన్నికలకు ముందుగానే కేసీఆర్ బయోపిక్ తెరపైకించనున్నట్టు తెలుస్తోంది.

ప్రముఖ కన్నడ జర్నలిస్ట్ గౌరీ లంకేష్ హత్యానంతరం ప్రకాశ్ రాజ్ తరచూ ప్రధాని మోడీకి వ్యతిరేకంగా గళం విప్పుతూనే ఉన్నారు. ఆయన కేసీఆర్ పాత్రలో నటిస్తే మూడో కూటమికి లాభిస్తుందని భావిస్తున్నారు. మోడీ సర్కార్‌కు వ్యతిరేకంగా పోరాడుతున్న ఇద్దరూ.. ఫెడరల్ ఫ్రంట్ గురించి చర్చించినట్టు తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories