పీకే 47...స్కెచ్‌ వేస్తే గెలిచి తీరాలిందే

పీకే 47...స్కెచ్‌ వేస్తే గెలిచి తీరాలిందే
x
Highlights

ఆయన సక్సెస్‌ ట్రాక్‌కు తిరుగులేదు. ఆయన స్కెచ్‌ వేస్తే గెలిచి తీరాలిందే అధికారంలో నిలవాల్సిందే నా దారి రహదారి అన్నట్లుగా అతడి చర్యలు ఊహతీతం....

ఆయన సక్సెస్‌ ట్రాక్‌కు తిరుగులేదు. ఆయన స్కెచ్‌ వేస్తే గెలిచి తీరాలిందే అధికారంలో నిలవాల్సిందే నా దారి రహదారి అన్నట్లుగా అతడి చర్యలు ఊహతీతం. ప్రజానాడిని పట్టుకోవడం ప్రత్యర్థులకు చుక్కలు చూపించి తికమకపెట్టడంలో దిట్ట. వ్యూహకర్తగా రంగంలోకి దిగితే చాలు గెలుపు దాసోహం అనాల్సిందే. ఇంతకు ఆయనెవరో తెలియాలంటే స్టోరీలోకి ఎంటర్‌ కావాల్సింది.

ప్రశాంత్ కిషోర్ రాజకీయనేతలకు పరిచయం అక్కరలేని పేరు. వైసీపీ అధినేత జగన్ కు సలహాదారుడు. జగన్‌కు అఖండ విజయం వరించడానికి తెరవెనుక అయన పడ్డ శ్రమే ఓ కారణం. జగన్‌ పదేళ్ల నిరీక్షణ ఫలించడానికి పీకే చేసిన ప్లాన్స్‌ అదుర్స్‌ అనిపించాయి. బిహార్‌లోని బక్సర్‌ ప్రాంతంలో సాధారణ కుటుంబం నుంచి వచ్చిన ప్రశాంత్‌కిషోర్‌ మొదటిసారిగా 2011లో రాజకీయ రంగంలోకి అడుగుపెట్టారు. ఇప్పటివరకు 5 ఎన్నికల్లో పార్టీలు, అభ్యర్థులకు వ్యూహాలు, ప్రచారం చేశారు. 2012లో జరిగిన గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో నరేంద్రమోడీని మూడోసారి అధికారంలోకి తీసుకువచ్చేందుకు ఏడాది ముందుగానే కార్యరంగంలో దిగి వ్యూహరచన చేసి విజయం సాధించారు.

2014లోనూ మోడీ ప్రధాని కావడంలో ప్రశాంత్‌కిషోర్‌ వ్యూహాలు ఎంతో పనిచేశాయి. ఆయనపై రాజకీయ పార్టీలకు గురి కుదరడంతో 2015లోనే వైసీపీ సంప్రదింపులు చేపట్టడం అవి ఓ కొలిక్కి రావడంతో గ్రౌండ్‌ వర్క్‌ స్టార్ట్‌ చేశాడు. అలా 2017 జూలై 6న ప్రశాంత్‌ కిశోర్‌ను పార్టీ వ్యూహకర్తగా వైసీపీ ముఖ్యనేతలకు జగన్‌ పరిచయం చేశారు. అప్పటి నుంచి వైసీపీలో సరికొత్త వైబ్రేషన్స్‌ మొదలయ్యాయి.

ఐదేళ్ల అధికారం కోసం జగన్‌ ఎంత శ్రమించాడో తెరవెనుక ప్రశాంత్ కిషోర్ టీమ్ అంతలా శ్రమించింది. కామన్‌గా రాజకీయ సలహాదారుడు కానీ ఆయన టీమ్ కానీ ఆఫీసులకే పరిమితం అవుతోంది. కానీ ప్రశాంత్ కిషోర్ టీమ్ అన్నింటా తానై అన్నట్లు వ్యవహరించింది. జగన్ కూడా పీకే టీమ్ కు ఎనలేని ప్రయారిటీ ఇవ్వడంతో పాటు ఏకంగా నిర్ణయాధికారం ఇవ్వడంతో పార్టీకి తిరుగులేని విజయాన్ని తెచ్చిపెట్టడంతో పాటు జగన్‌ను జనసమ్మోహితుడిగా మార్చేశారు

కేవలం స్ట్రాటజీలు అందించడమే కాదు, కాపుల రిజర్వేషన్ విషయంలో జగన్ తన అభిప్రాయం బలంగా చెప్పడంలో బిసిలను దగ్గరకు తీయడంలో పీకే సలహా సూచనలు పక్కాగా వున్నాయి. అదే సమయంలో నియోజకవర్గాల్లో ఎప్పటికప్పుడు సర్వేలు చేయడం, కులాల ఈక్వేషన్లు లెక్కించడం అభ్యర్థులను నిర్ణయించడం, వారికి ఖర్చు వ్యవహారంలో ఓ పద్దతి అనేది రూపొందించడం ఇలా చాలా విషయాల్లో పీకే పాత్ర కీలకం. అంతేకాక గ్రామస్థాయి నాయకులనూ చాపకింద నీరులా తమవైపునకు తిప్పుకొన్నారు. 'రావాలి జగన్‌ కావాలి జగన్‌' పాట , 'జగన్‌ అన్న పిలుపు పేర్ల చేపట్టిన ప్రచారం సక్సెస్‌ కావడంతో ప్రజలకు బాగా కనెక్ట్‌ అయింది.

వైసీపీలో పీకే పాత్ర ఎంతలా ఉంది అంటే చంద్రబాబే నేరుగా ప్రశాంత్ కిషోర్ ను విమర్శించే వరకు వెళ్లింది కులాల వారీగా రాష్ట్రాన్ని విడగొడుతున్నాడు పీకే అని చంద్రబాబు ఆరోపించారు. అయినా ప్రశాంత్ కిషోర్ వెనక్కు తగ్గలేదు. తన పని తను చేసుకుంటూ వెళ్లారు. ఎన్నికల పోలింగ్ తరువాత మాంచి పార్టీ ఇచ్చి మరీ జగన్ పీకే కు వీడ్కోలు పలికాడు. జగన్ సాధించిన ఈ అద్భుత విజయంలో పీకే పాత్ర మెయిన్‌రోల్‌.

Show Full Article
Print Article
Next Story
More Stories