తెలంగాణ టీచర్లకు రోగాలు

x
Highlights

తెలంగాణ టీచర్ల బదిలీల్లో పెద్దఎత్తున అక్రమాలు బయటపడ్డాయి. కోరుకున్నచోట పోస్టింగ్‌ కోసం ఉపాధ్యాయులు అడ్డదారులు తొక్కారు. బదిలీల్లో హెల్త్‌ సర్టిఫికెట్‌...

తెలంగాణ టీచర్ల బదిలీల్లో పెద్దఎత్తున అక్రమాలు బయటపడ్డాయి. కోరుకున్నచోట పోస్టింగ్‌ కోసం ఉపాధ్యాయులు అడ్డదారులు తొక్కారు. బదిలీల్లో హెల్త్‌ సర్టిఫికెట్‌ ఆయుధంగా మారడంతో అక్రమాలకు పాల్పడ్డారు. నోటిఫికేషన్‌లో లొసుగుల్ని తమకు అనుకూలంగా మార్చుకుని మార్గం తప్పారు. ఎన్నడూ సిక్‌ లీవ్‌ పెట్టనివాళ్లు సైతం పెద్దపెద్ద రోగాలున్నట్లు దొంగ సర్టిఫికెట్లు సృష్టించుకున్నారు. లేని రోగాలను ఉన్నట్లుగా నకిలీ ధృవపత్రాలు సమర్పించారు.

మార్గనిర్దేశనం చేయాల్సిన గురువులే దారి తప్పారు. విలువలు నేర్పాల్సిన ఉపాధ్యాయులు అనైతిక పనులకు పాల్పడ్డారు. కోరుకున్నచోట పోస్టింగ్‌ కోసం అడ్డదారులు తొక్కారు. విద్యాబుద్ధులు నేర్పించి మంచి సమాజాన్ని నిర్మించాల్సిన వాళ్లే నీతి తప్పారు. బదిలీల్లో సీనియారిటీ కంటే హెల్త్‌ పాయింట్సే కీలకంగా మారడంతో... లేని రోగాన్ని కొని తెచ్చుకున్నారు. వాళ్లతోపాటు మొత్తం కుటుంబ సభ్యులందరికీ రోగాలున్నట్లు తప్పుడు పత్రాలు సృష్టించారు.

తెలంగాణలో జరుగుతోన్న టీచర్ల బదిలీల్లో పెద్దఎత్తున అక్రమాలు బయటపడ్డాయి. తమకు కావాల్సిన చోట పోస్టింగ్‌ కోసం ఉపాధ్యాయులు తప్పుడు ధృవపత్రాలు సమర్పించారు. అన్నీ సక్రమంగా ఉన్నా అంగవైకల్యం ఉన్నట్టు, గుండె జబ్బులున్నట్లు నకిలీ సర్టిఫికెట్లు తెచ్చుకున్నారు. కాసులకు ఆశపడ్డారో, ఒత్తిళ్లేవయినా పనిచేశాయో తెలియదుగానీ కొందరు వైద్యులూ ఇందుకు సహకరించారు. బదిలీలకు సంబంధించి ఇచ్చిన ఉత్తర్వుల్లో పేర్కొన్న వ్యాధులు ఉపాధ్యాయులకు లేకపోయినా ఉన్నాయంటూ వారికి పత్రాలు జారీ చేశారు.

ఉమ్మడి మెదక్‌ జిల్లాలో పెద్దఎత్తున నకిలీ మెడికల్‌ సర్టిఫికెట్లు సమర్పించినట్లు ఫిర్యాదులు రావడంతో ఈ నకిలీ రోగిష్టి టీచర్ల బాగోతం బయటికొచ్చింది. దాంతో లేని రోగాలున్నట్టు చూపించిన 17 మంది ఉపాధ్యాయులపై అధికారులు సస్పెన్షన్‌ వేటు వేశారు. మెడికల్‌ సర్టిఫికెట్లు సమర్పించిన టీచర్లకు మరోసారి పరీక్షలు నిర్వహించి ఈ చర్యలు తీసుకున్నారు. గుండె ఆపరేషన్‌ జరగకున్నా జరిగినట్టు ధ్రువపత్రాలు జారీ చేసిన నలుగురు వైద్యులకు షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. సమగ్ర విచారణ తర్వాత డాక్టర్లపైనా చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. అలాగే ఎంఈవో, డీఈవోల పాత్ర ఉన్నట్లు తేలినా చర్యలు తప్పవని చెప్పారు. సస్పెన్షన్‌కు గురైన ఉపాధ్యాయుల్లో సిద్దిపేట జిల్లాలో నలుగురు, మెదక్‌లో ఏడుగురు, సంగారెడ్డిలో ఆరుగురు ఉన్నారు.

మొత్తం రాష్ట్రవ్యాప్తంగా ఇటువంటి అక్రమాలు జరిగినట్టు అధికారులు గుర్తించారు. గురుకుల పాఠశాలల్లోనూ పెద్దఎత్తున గోల్‌ మాల్‌ జరిగిననట్లు తెలుస్తోంది. దాంతో అన్ని జిల్లాల్లో మెడికల్‌ సర్టిఫికెట్లు సమర్పించిన టీచర్లకు మరోసారి వైద్య పరీక్షలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories