ఏటీఎం కి కనిపిస్తే చాలు..కార్డు తో పనిలేదు!

ఏటీఎం కి కనిపిస్తే చాలు..కార్డు తో పనిలేదు!
x
Highlights

డబ్బులు అవసరమయ్యాయి ఏటీఎం కి వెళ్లారు. డబ్బులు తీసుకున్నారు. కొద్దీ సేపటి తర్వాత మీ ఫోన్ కో మెసేజ్ బ్యాంక్ నుంచి వచ్చింది. మీరు తీసుకున్న ఎమౌంట్ కంటే...

డబ్బులు అవసరమయ్యాయి ఏటీఎం కి వెళ్లారు. డబ్బులు తీసుకున్నారు. కొద్దీ సేపటి తర్వాత మీ ఫోన్ కో మెసేజ్ బ్యాంక్ నుంచి వచ్చింది. మీరు తీసుకున్న ఎమౌంట్ కంటే ఎక్కువ ఎమౌంట్ తీసుకున్నారని. వెంటనే మీరు బ్యాంక్ ని సంప్రదించారు. మీ ఎకౌంట్ నుంచి ఒకే ఏటీఎం లో రెండు సార్లు వరుసగా ఎమౌంట్ తీసుకున్నారని. అదెలా అని విచారిస్తే.. మీరు విత్ డ్రా చేసిన వెంటనే మీ వెనుకే ఉన్న ఓ దొంగ మీ ఏటీఎం నుంచి డబ్బు కాజెసినట్టు తేలింది.

ఏటీఎం కి డబ్బుల కోసం వెళ్లారు. పిన్ మర్చిపోయారు. ఎంత ప్రయత్నించినా గుర్తురావడం లేదు. ఉసూరు అంటూ తిరిగొచ్చి బ్యాంక్ కు పిన్ కోసం రిక్వస్ట్ పంపించారు.

ఇలా ఏటీఎం ల తో ఎన్నో రకాల ఇబ్బందులు. ఇవన్నీ లేకుండా.. మిమ్మల్ని చూసిన వెంటనే ఏటీఎం నుంచి మీరు కోరిన సేవలు దొరికితే అంతకన్నా ఆనందం ఏమిటంటారు కదా. అందుకే స్పెయిన్ లోని కైకసా బ్యాంక్ కొత్త తరహా ఏటీఎం కు రూపకల్పన చేసింది. ఖాతాదారులు తమ ముఖాన్ని ఆ ఏటీఎం కు చూపిస్తే చాలు వారిని గుర్తు పట్టి ఎకౌంట్ కే కనెక్ట్ చేసేస్తుంది. ఈ ప్రత్యేక సౌకర్యాన్ని పొందేందుకు స్పెయిన్‌లోని అన్ని శాఖల్లో కైక్సా బ్యాంకు ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. నమోదిత అధికారి వద్ద ప్రత్యేక సాఫ్ట్‌వేర్ సాయంతో ముందుగా వినియోగదారుడి ముఖకవళికలను తీసుకుంటారు. ఈ సాఫ్ట్‌వేర్‌ వినియోగదారుడి ముఖంలోని 16 వేల ప్రదేశాలను గుర్తించి ఆకలింపు చేసుకుంటుంది. అనంతరం ఖాతాదారుడి పూర్తి సమాచారాన్ని బ్యాంకు సర్వర్‌లో నిక్షిప్తం చేస్తుంది. ఇక నేరుగా కైక్సా బ్యాంకు ఏటీఎం ముందు నిల్చుని కావాల్సిన డబ్బును టక్కున తీసుకోవచ్చు.

ఇప్పటికే కాంటాక్ట్‌లెస్‌ ఏటీఎంలతో బ్యాంకింగ్‌ రంగంలో విప్లవాత్మక చర్యలకు శ్రీకారం చుట్టిన కైక్సా బ్యాంకు.. ఇప్పుడు ముఖకవళికల ద్వారా నగదు అందించే ఏటీఎంలను పరిచయం చేసింది. ఇటువంటిది మనకి కూడా వచ్చేస్తే బావుండుననుకుంటున్నారు కదూ.. ఏటీఎంలో డబ్బులే ఉండడం లేదు ఇవన్నీ మన బ్యాంకులు ఎందుకు చేస్తాయి చెప్పండి?

Show Full Article
Print Article
Next Story
More Stories