ఉతికి ఆరేశారు!

ఉతికి ఆరేశారు!
x
Highlights

ఉత్కంఠ భరితంగా సాగుతుందనుకున్న పోరు చివరికి మామూలుగా అయిపొయింది. పోరాటం చేయడం కోసం నిదానమే ప్రధానం దారి ఎన్నుకున్న ఆస్ట్రేలియాకు ఆ నిదానమే కొంప...

ఉత్కంఠ భరితంగా సాగుతుందనుకున్న పోరు చివరికి మామూలుగా అయిపొయింది. పోరాటం చేయడం కోసం నిదానమే ప్రధానం దారి ఎన్నుకున్న ఆస్ట్రేలియాకు ఆ నిదానమే కొంప ముంచింది. అలా అని టీమిండియా ను తక్కువ అంచనా వేయడం కాదు. వికెట్లు పాడకపోయినా. పరుగులు ఇవ్వకుండా క్రమశిక్షణతో బౌలింగ్ చేసి.. ఎక్కడ తొణక్కుండా ఒత్తిడికి లొంగకుండా.. అవతలి పక్షాన్ని ఒత్తిడిలోకి నెట్టేశారు భారత ఆటగాళ్లు. ఫీల్డింగ్ లో చాలా కాలం తర్వాత టీమిండియా మెరిసింది. బంతులు బావున్దరీలు దాటకుండా ఆసీస్ బ్యాట్స్ మెన్ పరుగుల దాహంతో పిడచకట్టుకుపోయేలా చేశారు. ఆ ఒత్తిడి చివరకు టీమిండియాకు విజయసోపానంగా మారింది. కంగారూల ఇన్నింగ్స్ 27 వ ఓవర్ వరకూ రెండు టీమ్ లకు ఛాన్స్ ఉందనిపించినా భువనేశ్వర్ వరుసగా తీసిన రెండు వికెట్లతో.. మ్యాచ్ దాదాపు ఏకపక్షం అయిపొయింది. ఆసీస్ పోరాటం గెలుపు కోసం కాకుండా గెలుపు అంతరాన్ని తగ్గించడానికి ఉపయోగపడింది. వరుసగా రెండు విజయాలతో ఉన్న ఆస్ట్రేలియా హ్యాట్రిక్ ఆశల్ని సమాధి చేసేస్తూ టీమిండియా వరుసగా రెండో మ్యాచ్ గెలిచింది. అదీ సాధికారికంగా.. ఘనంగా..

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ 352 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఓపెనర్లు సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పగా.. శిఖర్ ధావన్ సెంచరీ సాధించి భారత్ భారీ స్కోరుకు పునాది వేశాడు. ఇక కోహ్లీ, పాండ్య ఆ పునాదుల మీద బలమైన గోడ కట్టేశారు. చివర్లో ధోనీ, రాహుల్ చితక్కొట్టే స్కోరు 350 దాటించారు.

ఇక భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కంగారూలు నిదానంగా పరుగుల వేటను ప్రారంభించారు. ఓపెనర్లు భువీ బౌలింగ్ ను ఎదుర్కోవడంలో చాలా ఇబ్బంది పడ్డారు. అయితే తఱువాత కుదురుకుని కొన్ని మెరుపులు మెరిపించారు కానీ, వారి జోడీని రనౌత్ రూపంలో యాదవ్ విడదీశాడు. తరువాత వచ్చిన స్మిత్ O మోస్తరుగా ఆడి పరుగుల వేగాన్ని పెంచే క్రమంలో అవుట్ అయిపోయాడు. ఇక వేగంగా అదే క్రమంలో ఖ్వాజా, మాక్స్ వెల్ లు కూడా త్వరగానే అవుటయ్యాడు. దీంతో విజయం భారత్ కు ఖాయమైపోయింది. చివర్లో కారే 55 పరుగులతో పోరాటం చేసినా..అవతలి వైపు అతనికి సహకరించే వారేలేకపోయారు.

మొత్తమ్మీద 36 పరుగుల తేడాతో టీమిండియా తన చిరకాల ప్రత్యర్థి.. టోర్నీలో బలమైన ప్రత్యర్థి అయినా ఆస్ట్రేలియా పై ఘన విజయం సాధించింది.

ఆస్ట్రేలియా బ్యాటింగ్


















భారత్ బౌలింగ్..














Show Full Article
Print Article
More On
Next Story
More Stories