శ్రీదేవి జీవితంలో మరపురాని ఘట్టాలు...

శ్రీదేవి జీవితంలో మరపురాని ఘట్టాలు...
x
Highlights

లైట్స్, కెమెరా, యాక్షన్.. జీవితాంతం ఈ మూడు పదాల వెంట నడిచిన శ్రీదేవి ఆకస్మిక మరణం సినీ ప్రియులను కలచివేస్తోంది. తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమలో రారాణిగా...

లైట్స్, కెమెరా, యాక్షన్.. జీవితాంతం ఈ మూడు పదాల వెంట నడిచిన శ్రీదేవి ఆకస్మిక మరణం సినీ ప్రియులను కలచివేస్తోంది. తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమలో రారాణిగా వెలుగొందిన శ్రీదేవి హిందీలో 1983లో చేసిన రెండో చిత్రం ‘హిమ్మత్‌వాలా’తో బాలీవుడ్‌లోనూ సత్తా చాటింది. ఆ తర్వాత ‘లమ్హే’ సినిమాతో ఆమె ప్రభ వెలిగిపోయింది. అనతికాలంలో లేడీ సూపర్‌స్టార్‌గా ఎదిగి బాలీవుడ్‌లో ఆ ఘనత సాధించిన తొలి నటిగా రికార్డు సృష్టించింది. దశాబ్దాల ప్రస్థానంలో తిరుగులేని నటిగా అవతరించింది. శ్రీదేవికి సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలు..
1963, ఆగస్టు 13న జన్మించిన శ్రీదేవి తన నాలుగేళ్లప్రాయంలోనే తమిళ సినిమాలో నటించింది. తమిళనాడులోని మీనాంపుట్టిలో జన్మించిన శ్రీదేవి తండ్రి న్యాయవాది. శ్రీదేవికి ఒక సోదరి, ఇద్దరు సవతి సోదరులు ఉన్నారు.
1976 వరకూ శ్రీదేవి బాలనటిగా పలు చిత్రాల్లో నటించింది. 1976లో ఆమె తమిళ సినిమా ‘మందరూ ముదిచి’ చిత్రంలో హీరోయిన్‌గా నటించింది.
1971 నాటికే శ్రీదేవి పలు అవార్డులు అందుకుంది. మలయాళం సినిమా ‘మూవీ పూమ్ బత్తీ’లో నటనకుగాను కేరళ రాష్ట్రస్థాయి అవార్డు అందుకుంది.
1979లో హిందీ చిత్రరంగంలో ఆమె కాలు మోపింది. ‘హిమ్మత్‌వాలా’లో తిరుగులేని విజయ పరంపర కొనసాగించింది.
1996లో శ్రీదేవి... నిర్మాత బోనీకపూర్‌ను వివాహం చేసుకుంది. వారికి ఇద్దరు కుమార్తెలు జాహ్నవి, ఖుషి.
తన సుదీర్ఘ కెరియర్‌లో శ్రీదేవి మొత్తం 200 సినిమాల్లో నటించింది. హిందీలో 63, తెలుగులో 62, తమిళంలో58, మలయాళంలో 21 సినిమాల్లో నటించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories