'స్పైడ‌ర్' క‌థ ఏమిటంటే..

స్పైడ‌ర్ క‌థ ఏమిటంటే..
x
Highlights

ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు ఎ.ఆర్‌.ముర‌గ‌దాస్ తెర‌కెక్కించే సినిమాలు రెగ్యుల‌ర్‌గా ఉండ‌వు. ఏదో ఒక సందేశాన్ని క‌థ‌లో అంత‌ర్లీనంగా ప్ర‌స్తావిస్తూ ఆయ‌న త‌న...

ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు ఎ.ఆర్‌.ముర‌గ‌దాస్ తెర‌కెక్కించే సినిమాలు రెగ్యుల‌ర్‌గా ఉండ‌వు. ఏదో ఒక సందేశాన్ని క‌థ‌లో అంత‌ర్లీనంగా ప్ర‌స్తావిస్తూ ఆయ‌న త‌న సినిమాల్ని తెర‌కెక్కిస్తుంటారు. 'గ‌జిని' చిత్రంతో తెలుగు వారికి ప‌రిచ‌య‌మైన‌ మురుగ‌దాస్ 'స్టాలిన్‌', 'తుపాకి' చిత్రాల‌తో మ‌రింత ద‌గ్గ‌ర‌య్యారు. ఆయ‌న తాజా చిత్రం 'స్పైడ‌ర్' రేపు విడుద‌ల కానుంది. ఈ చిత్రం క‌థ‌పై ర‌క‌ర‌కాల క‌థ‌నాలు వ‌చ్చాయి. అయితే మురుగ‌దాస్‌నే నేరుగా ఈ సినిమా క‌థేంటో చెప్పుకొచ్చారు.. ఓ ఇంట‌ర్వ్యూలో.

ఇంత‌కీ 'స్పైడ‌ర్' క‌థేమిటంటే.. ''టెక్నాల‌జీ బాగా పెరిగిపోయిన ఈ రోజుల్లో ఏ విష‌యాన్ని కూడా ర‌హ‌స్యంగా ఉంచ‌డం కుద‌రదు. ఇక‌ గ‌వ‌ర్న‌మెంట్ త‌ల‌చుకుంటే.. సామాన్యుడికి సంబంధించిన చిన్న విష‌యాన్నైనా రాబ‌ట్ట‌గ‌ల‌దు. అలాంటి ప‌రిస్థితిని త‌న‌కు అనుకూలంగా చేసుకున్న ఓ తీవ్ర‌వాది.. ఎలాంటి ప్రాబ‌మ్స్ క్రియేట్ చేశాడు? జ‌నాల కంట క‌న‌ప‌డ‌కుండా త‌ప్పించుకుంటున్న ఆ తీవ్ర‌వాదిని ఓ స్పై ఎలా అదుపులోకి తెచ్చుకున్నాడు?'' అనేదే ఈ సినిమా క‌థ‌. క‌థానాయ‌కుడు మ‌హేష్‌, ప్ర‌తినాయకుడు ఎస్‌.జె.సూర్య మ‌ధ్య సాగే స‌న్నివేశాల‌తో ఈ సినిమా ఆద్యంతం ఆస‌క్తిక‌రంగా ఉంటుంద‌ని మురుగ‌దాస్ చెప్పుకొచ్చాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories