అర్దవంతమైన సినిమా ...ఆటగదరా శివ!

Submitted by arun on Wed, 12/05/2018 - 16:49
aatagadharaa siva movie

ఆటగదరా శివ 2018 లో విడుదలైన తెలుగు సినిమా.కన్నడలో ఘనవిజయం సాదించిన రామ రామరే సినిమా దీనికి మాతృక. ఈ సినిమాలో కన్నడ నటుడు దొడ్డన్న, ఉదయ్‌ శంకర్‌, జబర్దస్త్‌ ఫేం హైపర్‌ ఆదిలు కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా దర్శకత్వం వహించింది ప్రముఖ దర్శకుడు చంద్ర సిద్ధార్థ. అలాగే నిర్మాత రాక్‌లైన్‌ వెంకటేష్‌ . ఈ సినిమాకి సంగీతం వాసుకి వైభవ్‌ అందించారు. ఈ సినిమా కథ చాల విభిన్నమైనది, విలక్షనమైనది.. జంగయ్య (దొడ్డన్న) తలారీ. ఊళ్లో పశువులకు వైద్యం చేస్తూ ఉండే జంగయ్య, ప్రభుత్వం నుంచి పిలుపు వచ్చినప్పుడు వెళ్లి తలారీ బాధ్యతలు నిర్వహిస్తుంటాడు. అలా ఉరిశిక్ష పడ్డ ఖైదీ గాజులమర్రి బాబ్జీ(ఉదయ్ శంకర్‌)ని ఉరితీసేందుకు రావాల్సిందిగా జంగయ్యకు కబురందుతుంది. జంగయ్య బయలుదేరే సమయానికి బాబ్జీ.. జైల్లో కాపలాదారుడిని గాయపరిచి పారిపోతాడు. బయటకు వచ్చి బాబ్జీ చాలా దూరం పరిగెత్తి పరిగెత్తి చివరకు జీపులో వెళ్తున్న జంగయ్యనే సహాయం చేయమని అడుగుతాడు. కొద్ది దూరం ప్రయాణం తరువాత దిన పత్రికలో ఉరిశిక్ష పడ్డ ఖైదీ పరార్‌ అంటూ  వచ్చిన ప్రకటన చూసిన జంగయ్య బాబ్జీని గుర్తుపడతాడు. అయినా ఏం తెలియనట్టే ప్రయాణం కొనసాగిస్తారు. వారి ప్రయాణం చివరకు ఎలా ముగిసింది..? ఈ ప్రయాణంలో వాళ్లకు ఎదురైన అనుభవాలేంటి..? కలిసిన వ్యక్తులు ఎవరు..? అన్నదే మిగిలిన కథ.. మీరు ఈ సినిమాని చూడకుంటే మాత్రం, ఒక సారి చూడండి. శ్రీ.కో.

English Title
aatagadharaa siva movie review

MORE FROM AUTHOR

RELATED ARTICLES