శ్రీలంక బాంబు పేలుళ్లతో.. ఏపీ పోలీసులు అప్రమత్తం

శ్రీలంక బాంబు పేలుళ్లతో.. ఏపీ పోలీసులు అప్రమత్తం
x
Highlights

ఏపీ పోలీసులు అప్రమత్తం అయ్యారు. తీర ప్రాంత జిల్లాల్లో గస్తీ ముమ్మరం చేశారు. నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లోని మెరైన్ పోలీసులు, లా అండ్ ఆర్డర్ పోలీసులు...

ఏపీ పోలీసులు అప్రమత్తం అయ్యారు. తీర ప్రాంత జిల్లాల్లో గస్తీ ముమ్మరం చేశారు. నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లోని మెరైన్ పోలీసులు, లా అండ్ ఆర్డర్ పోలీసులు నిఘా పెంచారు. అసలు తీరంలో ఏం జరుగుతోంది.? ప్రకాశం, నెల్లూరు జిల్లాలపై కేంద్ర ఇంటెలిజెన్స్ ఎందుకు దృష్టి సారించింది..? శ్రీలంక బాంబు పేలుళ్లతో తీరం వెంట నిఘా ముమ్మరం చేశారు. శ్రీలంక పేలుళ్ల తర్వాత నిందితులు తప్పించుకునే క్రమంలో సముద్ర మార్గం ద్వారా మన భూభాగంలోకి ప్రవేశించే అవకాశం ఉందని నిఘా వర్గాల నుంచి సమాచారం అందింది. కేంద్రం హెచ్చరికలతో రాష్ట్ర పోలీసులు అప్రమత్తం అయ్యారు.

తీరం వెంట ఉన్న గ్రామాల్లో మత్స్యకారులను అప్రమత్తం చేశారు. సముద్ర జలాల్లో ఎక్కడైనా, ఎవరైనా కొత్త వ్యక్తులు తారస పడితే తమకు సమాచారం ఇవ్వాలని సూచించారు. రాష్ట్రంలోని తడ నుంచి ఇచ్చాపురం వరకు 972 కి.మీ. పరిధిలో ఉన్న తీరంపై 22 మెరైన్ పోలీస్ స్టేషన్ల పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. ప్రస్తుతం సముద్రంలో వేట నిషేధం ఉంది. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లటం లేదు. అలల ఘోష తప్ప సముద్రంలో మరే అలికిడి లేదు. అయినా ఇప్పుడు తీరంలో గస్తీ ముమ్మరమైంది. గతంలో తమిళనాడు, ఒంగోలు తీరం వెంబడి జరిగిన ఘటనల నేపథ్యంలో శ్రీలంక నుంచి సముద్ర మార్గాన మన రాష్ట్ర తీరంలో యథేచ్చగా రాకపోకలు సాగించే అవకాశం ఉందని పోలీసులు తీరంలో అప్రమత్తం అయ్యారు.

Show Full Article
Print Article
Next Story
More Stories