65వ జాతీయ అవార్డుల ప్రకటన

65వ జాతీయ అవార్డుల ప్రకటన
x
Highlights

65వ జాతీయ అవార్డుల ప్రకటన అట్టహాసంగా ప్రారంభమైంది. దేశ రాజధాని దిల్లీలో ఈ కార్యక్రమం జరుగింది. బాలీవుడ్‌ దర్శకుడు శేఖర్‌ కపూర్‌ ఈ అవార్డులను...

65వ జాతీయ అవార్డుల ప్రకటన అట్టహాసంగా ప్రారంభమైంది. దేశ రాజధాని దిల్లీలో ఈ కార్యక్రమం జరుగింది. బాలీవుడ్‌ దర్శకుడు శేఖర్‌ కపూర్‌ ఈ అవార్డులను ప్రకటించారు. 2017లో విడుదలైన తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళంలో వచ్చిన అద్భుతమైన చిత్రాలను పరిగణలోకి తీసుకుని అవార్డు విజేతలను ప్రకటించారు.

జాతీయ స్థాయి అవార్డుల్లో తెలుగు సినిమా సత్తా చాటింది. 65వ జాతీయ చలనచిత్ర పురస్కారాల విజేతలను ప్రకటించారు. జాతీయ స్థాయి సినీ పురస్కారాల్లో ఉత్తమ తెలుగు చిత్రంగా ఘాజీ సినిమా అవార్డ్ దక్కించుకుంది. 2017లో డైరెక్టర్ సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో..వచ్చిన ఘాజీ సినిమాను 1971లో భారత్‌, పాకిస్థాన్‌ల మధ్య జరిగిన యుద్ధం నేపథ్యంలో తెరకెక్కించారు. స‌బ్ మేరిన్ బ్యాక్ డ్రాప్ తో వచ్చిన తొలి ఇండియాన్ సినిమాగా ఘాజీ పేరు సంపాదించుకుంది. రానా దగ్గుబాటి, తాప్సీ, ఓంపూరితో పాటు పలవురు బాలివుడ్ నటులు ఈ సినిమాలో నటించారు. దేశభక్తి నేపథ్యంలో వచ్చిన ఘాజీ సినిమా విమర్శకుల ప్రశంసలు పొందింది.

ఇప్పటికే ఆల్ ఇండియా సినిమా రికార్డులన్నింటినీ బద్దలు కొట్టిన బాహుబలి..జాతీయస్థాయిలో మరోసారి సత్తా చాటింది. రాజమౌళి డైరెక్షన్ లో వచ్చిన బాహుబలి 2 సినిమా..బెస్ట్ స్పెషల్ ఎఫెక్ట్స్, బెస్ట్ యాక్షన్ డైరెక్షన్ విభాగాల్లో నేషనల్ అవార్డులను సొంతం చేసుకుంది.

బాలివుడ్ లో అమిత్ మసూర్కర్ డైరెక్షన్ లో వచ్చిన న్యూటన్ చిత్రం... ఉత్తమ చిత్రంగా అవార్డ్ ను దక్కించుకుంది. మామ్ సినిమాకు గానూ శ్రీదేని ఉత్తమ నటిగా అవార్డ్‌ను దక్కించుకుంది. మామ్ సినిమాకు.. బెస్ట్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ ఏ.ఆర్ రెహ్మాన్ అవార్డ్ ను దక్కించుకున్నాడు. ఈసారి జాతీయ సినీ పురస్కారాల్లో మలయాళం ఫిల్మ్ ఇండస్ట్రీ ఎక్కువ అవార్డులను కైవసం చేసుకుంది. బెస్ట్ సింగర్ గా ఏసుదాసు, భయానకం సినిమాకు గానూ బెస్ట్ డైరెక్టర్ గా జైరాజ్, బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ గా ఫహాద్ ఫజిల్, బెస్ట్ సినిమాటోగ్రఫీ విభాగంలో నిఖిల్ ఎస్ ప్రవీణ్.. మలయాళం సినీ పరిశ్రమలో అవార్డులను దక్కించుకున్నారు. ఓవరాల్ గా జాతీయ ఉత్తమ చిత్రంగా విలేజ్ రాక్ స్టార్స్ సినిమా అవార్డ్ ను దక్కించుకుంది. నగర్ కీర్తన్ సినిమాలో నటనకు గానూ..ఉత్తమ నటుడిగా రిద్ది సేన్ అవార్డ్ ను దక్కించుకున్నాడు.

దాదా సాహెల్ ఫాల్కె అవార్డు: వినోద్ ఖన్నా
బెస్ట్ యాక్టర్: రిద్ధీ సేన్, నగర్ కిర్టాన్
బెస్ట్ యాక్ట్రెస్: శ్రీదేవి (మామ్)
బెస్ట్ డైరెక్టర్: జయరాజ్ (భయానకం, మలయాళం)
బెస్ట్ ఫీచర్ ఫిల్మ్: విలేజ్ రాక్‌స్టార్స్ (అస్సామీస్)
బెస్ట్ హిందీ ఫిల్మ్: న్యూటన్
బెస్ట్ రీజినల్ ఫిల్మ్: లఢాఖ్
బెస్ట్ తెలుగు ఫిల్మ్: ఘాజి
బెస్ట్ యాక్షన్ డైరెక్షన్: బాహుబలి 2
బెస్ట్ కొరియోగ్రాఫర్ : గణేష్ ఆచార్య (టాయిలెట్ ఏక్ ప్రేమ్ కథ)
బెస్ట్ స్పెషల్ ఎఫెక్ట్స్: బాహుబలి 2
బెస్ట్ మ్యూజిక్ డైరెక్షన్ : ఏఆర్ రెహమాన్ (కాట్రు వేలియిదాయ్)
బ్యాక్‌గ్రౌండ్ స్కోర్: ఏఆర్ రెహమాన్ (మామ్)
బెస్ట్ మేల్ ప్లేబ్యాక్ సింగర్: యేసుదాస్
బెస్ట్ పాపులర్ ఫిల్మ్: బాహుబలి 2

Show Full Article
Print Article
Next Story
More Stories