కర్నాటకలో ముదిరిన రాజకీయ సంక్షోభం

కర్నాటకలో ముదిరిన రాజకీయ సంక్షోభం
x
Highlights

కర్నాటక సంకీర్ణ ప్రభుత్వంలో సంక్షోభం నెలకొంది. తమ పదవులకు రాజీనామా చేసేందుకు 8 మంది ఎంఎల్‌ఎ లు సిద్ధమయ్యారు. తమ రాజీనామా లేఖను ఇచ్చేందుకు స్పీకర్‌...

కర్నాటక సంకీర్ణ ప్రభుత్వంలో సంక్షోభం నెలకొంది. తమ పదవులకు రాజీనామా చేసేందుకు 8 మంది ఎంఎల్‌ఎ లు సిద్ధమయ్యారు. తమ రాజీనామా లేఖను ఇచ్చేందుకు స్పీకర్‌ కార్యాలయానికి వెళ్లారు. కర్నాటకలో ఇప్పటికే ఇద్దరు కాంగ్రెస్‌ ఎంఎల్‌ఎ లు రాజీనామా చేశారు. ప్రస్తుతం ముగ్గురు అధికార జేడీఎస్ ఎమ్మెల్యేలు, ఐదు మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామాల బాట పట్టారు. స్పీకర్‌ కార్యాలయానికి వెళ్లిన వారిలో ఎంఎల్‌ఎ లు ప్రతాప్ గౌడ, శివరామ్ హెబ్బర్, రమేష్‌ జక్కహళ్ళి, గోపాలయ్య, రమేష్ హళ్లి, విశ్వనాథ్, నారాయణ గౌడ, బీసీ పాటిల్ ఉన్నారు. కర్నాటక సిఎం కుమార స్వామి అమెరికాలో ఉన్నారు. ఎమ్మెల్యేల రాజీనామాల ఆందోళనతో ఆయన హుటాహుటిన బెంగళూరుకు బయలుదేరారు.

224 అసెంబ్లి స్థానాలు ఉన్న కర్ణాటకలో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కావాల్సిన మేజిక్‌ ఫిగర్‌ 112. బీజేపీకి 104 మంది సభ్యులు ఉన్నారు. కాంగ్రెస్‌-జేడీఎస్‌ కూటమికి 117 మంది సభ్యుల బలం ఉంది. ఈ మేజిక్ ఫిగ‌ర్ నుంచి 8 మంది ఎమ్మెల్యేలు జారుకోవడం అధికార జేడీఎస్, కాంగ్రెస్ పార్టీలను క‌ల‌వ‌రానికి గురిచేస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories