మొలకెత్తిన గింజలు తినడం వల్ల..

మొలకెత్తిన గింజలు తినడం వల్ల..
x
Highlights

మెులకెత్తిన గింజలు తినడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందవచచ్చు. వాటిలో ఉండే విటమిన్లు,ఖనిజాలు శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తాయి. కావున మీ...

మెులకెత్తిన గింజలు తినడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందవచచ్చు. వాటిలో ఉండే విటమిన్లు,ఖనిజాలు శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తాయి. కావున మీ రోజువారి ఆహార ప్రణాళికలో మెులకెత్తిన గింజలను చేర్చండి.

మెులకెత్తిన గింజల్లో ఎలాంటి పోషకాలు ఉంటాయి..

మొలకెత్తిన గింజల్లో ప్రోటీన్, మెగ్నీషియం, ఫాస్ఫరస్, మాంగనీస్, ఫోలేట్, విటమిన్ సి విటమిన్ కె లాంటి అద్భుతమైన పోషకాలు ఉంటాయి. అలాగే వాటిలోయాంటీ ఆక్సిడెంట్లు, అమైనో ఆమ్లాల సమ్మేళనాలు సమృద్ధిగా ఉంటాయి. మొలకెత్తిన గింజలలో ఉండే ప్రోటీను నిల్వలు సులభంగా జీర్ణమవుతాయి. వీటి వల్ల పోషకాలను శరీరం సులభంగా గ్రహించేలా చేస్తుంది.

మెులకెత్తిన గింజలు తీసుకోవడం వల్ల ఉపయోగాలు:

జీర్ణక్రియ మెరుగుపడుతుంది: మొలకెత్తిన గింజలు అధిక మొత్తాలలో సజీవ ఎంజైములను కలిగి ఉంటాయి. ఇవి జీర్ణక్రియను పెంచి శరీరంలోని రసాయనిక చర్యలను మెరుగుపరచడంలో సహకరిస్తాయి.వాటిలో్ ఎంజైములు ఆహారంలోని పోషకాల శోషించేందుకు ఉపయోగపడుతాయి. మలబద్ధకాన్ని నివారిస్తుంది

గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది: మొలకెత్తిన గింజలను తినడం వల్ల శరీరంలో మంచి కొలెస్ట్రాల్ పెరిగి చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. దీని ద్వారా గుండె నొప్పిలాంటి సమస్యలు ఉండవు. వాటిలో ఉండే ఫైటోఎరోజెన్ నిల్వలు , గుండె ఆరోగ్యానికి ఎంతగానో దోహదపడతాయి.

బరువు తగ్గడంలో సహాయం : మొలకెత్తిన గింజల్లో ఉండే ఫైబర్ కంటెంట్ బరువు తగ్గడానికి సహాయపడుతుంది. వాటిలో ఉండే ఫైబర్ ఎక్కువసేపు కడుపు నిండి ఉండేలా చూసి ఆకలి తొందరగా కలగకుండా చేస్తుంది. వేరుశనగ మొలకలు ఎక్కువగా తినడం వల్ల ఊబకాయంతో బాధపడుతున్న మహిళల్లో కొవ్వును తగ్గించగలగుతుంది.

రోగనిరోధక శక్తిని పెంచడానికి . . విటమిన్ ' C ' మొలకెత్తిన గింజల్లో ఎక్కువగా ఉండడం వల్ల తెల్ల రక్త కణాలు (WBCs) శక్తివంతంగా పనిచేయడంలో తోడ్పడుతుంది. తద్వారా రోగనిరోధక శక్తిని పెంచగలుగుతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories