5 రోజులు.. 20 మిలియ‌న్లు

5 రోజులు.. 20 మిలియ‌న్లు
x
Highlights

త‌మిళ‌నాట క‌థానాయ‌కుడు విజ‌య్ కుండే క్రేజే వేరు. మాస్‌లో విజ‌య్‌కి ఎలాంటి ఫాలోయింగ్ ఉందో ఆయ‌న కొత్త చిత్రం టీజ‌ర్ మరోసారి రుజువు చేసింది. విజ‌య్...

త‌మిళ‌నాట క‌థానాయ‌కుడు విజ‌య్ కుండే క్రేజే వేరు. మాస్‌లో విజ‌య్‌కి ఎలాంటి ఫాలోయింగ్ ఉందో ఆయ‌న కొత్త చిత్రం టీజ‌ర్ మరోసారి రుజువు చేసింది. విజ‌య్ త్రిపాత్రాభిన‌యంలో రూపొందిన త‌మిళ చిత్రం 'మెర్స‌ల్' (తెలుగులో 'అదిరింది') టీజ‌ర్‌ని సెప్టెంబ‌ర్ 21న విడుద‌ల చేశారు. 20 గంట‌ల్లోపే ఈ సినిమా టీజ‌ర్ 10 మిలియ‌న్ల వ్యూస్‌ని సొంతం చేసుకుంది. అంతేకాకుండా.. మ‌రో నాలుగు రోజుల్లో ఇంకో 10 మిలియ‌న్ల వ్యూస్‌ని సొంతం చేసుకుని.. మొత్తంగా 5 రోజుల్లో 20 మిలియ‌న్ల వ్యూస్ తో రికార్డ్ సృష్టించింది.

'రాజా రాణి' ఫేమ్ అట్లీ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ చిత్రంలో నిత్యామీన‌న్‌, కాజ‌ల్‌, స‌మంత హీరోయిన్స్‌గా న‌టించారు. ఎ.ఆర్‌.రెహ‌మాన్ సంగీత‌మందించారు. దీపావ‌ళి కానుక‌గా వ‌చ్చే నెల 18న ఈ సినిమా విడుద‌ల కానుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories