కాళేశ్వరం ఆపే ప్రసక్తే లేదు: హైకోర్టు

కాళేశ్వరం ఆపే ప్రసక్తే లేదు: హైకోర్టు
x
Highlights

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు పనులను ఆపే ప్రసక్తే లేదని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. కాళేశ్వరంతో పాటు...

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు పనులను ఆపే ప్రసక్తే లేదని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. కాళేశ్వరంతో పాటు దాని అనుబంధ ప్రాజెక్టు పనులపై ఎట్టి పరిస్థితుల్లో స్టే విధించలేమని తేల్చిచెప్పింది. ప్రభుత్వం ఇచ్చే పరిహారం తీసుకోవాలని నిర్వాసితులకు హైకోర్టు ధర్మాసనం సూచించింది. అయితే పరిహారంలో ఎలాంటి అన్యాయం జరిగినా తమ వద్దకు రావొచ్చని న్యాయస్థానం తెలిపింది. అలాగే కాళేశ్వరంపై ఉన్న అన్ని పిటిషన్లను విచారించేందుకు హైకోర్టు అంగీకారం తెలిపింది.

మరోవైపు మల్లన్నసాగర్‌ నిర్వాసితుల పిటిషన్లపైనా హైకోర్టు విచారణ చేపట్టింది. 47 ఎకరాలకు చెందిన నిర్వాసితులు పరిహారం తీసుకోవడం లేదని ప్రభుత్వం హైకోర్టు దృష్టికి తీసుకొచ్చింది. బాధితుల చెక్కులను కోర్టులో డిపాజిట్‌ చేసింది. కేవలం 47 ఎకరాల కోసం ఇంత పెద్ద ప్రాజెక్టు పనులను నిలిపివేయలేమని ధర్మాసనం తెలిపింది. చట్ట ప్రకారం నిర్వాసితులకు నష్టపరిహారం అందించాలని సూచించింది. బాధితులకు ఎవరికీ అన్యాయం జరగకుండా చూడాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories