అమెరికా ఆర్థిక వ్య‌వ‌స్థ‌కు 300 బిలియ‌న్ డాల‌ర్ల న‌ష్టం

అమెరికా ఆర్థిక వ్య‌వ‌స్థ‌కు 300 బిలియ‌న్ డాల‌ర్ల న‌ష్టం
x
Highlights

ఫ్లోరిడాః అమెరికాలోని ప్ర‌ధాన న‌గ‌రాల‌ను తుఫాను అత‌లాకుత‌లం చేసింది. జ‌న జీవ‌నం స్థంభించిపోయింది. ఫ్లోరిడా ప్ర‌జ‌లు భ‌యం గుప్పిట్లో...

ఫ్లోరిడాః అమెరికాలోని ప్ర‌ధాన న‌గ‌రాల‌ను తుఫాను అత‌లాకుత‌లం చేసింది. జ‌న జీవ‌నం స్థంభించిపోయింది. ఫ్లోరిడా ప్ర‌జ‌లు భ‌యం గుప్పిట్లో బ‌తుకీడుస్తున్నారు. హ‌రికేన్ ఇర్మా వ‌ల్ల అమెరికా దేశ‌ ఆర్థిక వ్య‌వ‌స్థ కుదేలైంది. ఈ తుఫాను ఇప్ప‌టి వ‌ర‌కూ 300 బిలియ‌న్ డాల‌ర్ల న‌ష్టాన్ని మిగిల్చిన‌ట్లు ఆర్థిక నిపుణులు అంచ‌నా వేస్తున్నారు. ది గార్డియ‌న్ మీడియా సంస్థ లెక్క‌ల ప్ర‌కారం ఈ తుఫాను వ‌ల్ల 2 ట్రిలియ‌న్ డాల‌ర్ల ఆస్తి న‌ష్టం వాటిల్లింద‌ని తేలింది. మొత్తం అమెరికాలోనే ఉత్పాద‌క‌ రంగంలో రెండో స్థానంలో, ఆరెంజ్ జ్యూస్ ఉత్ప‌త్తిలో ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉన్న ఫ్లోరిడా ఈ తుఫాను బీభ‌త్సానికి కుదేలైంది. దీనివ‌ల్ల అమెరికాలో ఆహార ఉత్ప‌త్తుల ధ‌ర‌లు గ‌ణనీయంగా పెరిగాయి.

చ‌క్ వాట్సాన్ అనే అమెరికా ఆర్థిక నిపుణుడు మాట్లాడుతూ ప‌రిస్థితి భ‌యాన‌కంగా మారింద‌న్నారు. ఇర్మా వ‌ల్ల 150 నుంచి 300 బిలియ‌న్ డాల‌ర్ల ఆర్థిక న‌ష్టం పూడ్చుకోవాల్సిన ప‌రిస్థితి అమెరికాలో క‌నిపిస్తోంద‌న్నారు. ఆర్థిక వ్య‌వ‌స్థ ప‌రిస్థితి ఇలా ఉంటే ఫ్లోరిడా న‌గ‌రం ఈ తుఫాను సృష్టించిన భ‌య‌నక ప‌రిస్థితి నుంచి ఇప్ప‌ట్లో బ‌య‌ట‌ప‌డేలా క‌నిపించ‌డం లేదు. పైగా తుఫాను హెచ్చ‌రిక‌లు మ‌రింత క‌ల‌వ‌ర‌పెడుతున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories