నాలుగేళ్ల 'అత్తారింటికి దారేది'

x
Highlights

'మేన‌త్త అంటే అమ్మ‌తో స‌మానం అని భావించే ఓ యువ‌కుడు.. కొన్ని కార‌ణాల వ‌ల్ల ఆమె పుట్టింటికి దూర‌మైతే..ఆమెని తిరిగి త‌న వారికి ద‌గ్గ‌ర చేయ‌డానికి చేసిన...

'మేన‌త్త అంటే అమ్మ‌తో స‌మానం అని భావించే ఓ యువ‌కుడు.. కొన్ని కార‌ణాల వ‌ల్ల ఆమె పుట్టింటికి దూర‌మైతే..ఆమెని తిరిగి త‌న వారికి ద‌గ్గ‌ర చేయ‌డానికి చేసిన ప్ర‌య‌త్న‌మే అత్తారింటికి దారేది చిత్రం'. ప‌వ‌న్ క‌ళ్యాణ్ లాంటి స్టార్ హీరో ఉన్నా.. అత‌ని ఇమేజ్‌ని దృష్టిలో పెట్టుకోకుండా.. కాన్సెప్ట్ ప్ర‌కార‌మే టైటిల్ పెట్ట‌డం అనేది అప్ప‌ట్లో పెద్ద హాట్ టాపిక్ అయ్యింది. మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ చిత్రం.. విడుద‌ల‌కి ముందు లీక‌యినా.. బాక్సాఫీస్ వ‌ద్ద సంచ‌ల‌న విజ‌యం సాధించడం అప్ప‌ట్లో అంద‌ర్నీ ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. సినిమాలో కంటెంట్ బ‌లంగా ఉంటే.. పైర‌సీ, లీకేజ్ లాంటివి ఏమీ చేయ‌లేవ‌ని ఈ సినిమా నిరూపించిన‌ట్ల‌య్యింది.

ఇక‌, దేవిశ్రీ ప్ర‌సాద్ సంగీతంలో పాట‌ల‌న్నీ హిట్టయ్యాయి. బ‌హుళ ప్ర‌జాద‌ర‌ణ పొందిన చిత్రం, ఉత్త‌మ స‌హాయ‌న‌టి (న‌దియా), ఉత్త‌మ సంగీత ద‌ర్శ‌కుడు, ఉత్త‌మ మాట‌ల ర‌చ‌యిత (త్రివిక్ర‌మ్‌) విభాగాల్లో నంది పుర‌స్కారాల‌ను సొంతం చేసుకోవ‌డంతో పాటు ప‌లు ఇత‌ర అవార్డుల‌ను కైవ‌సం చేసుకున్న ఈ సినిమా క‌న్న‌డ‌, బెంగాలీ భాష‌ల్లో రీమేక్ అయ్యింది. స‌మంత‌, ప్ర‌ణీత హీరోయిన్స్‌గా న‌టించిన ఈ చిత్రాన్ని బి.వి.ఎస్‌.ఎన్‌.ప్ర‌సాద్ నిర్మించారు. సెప్టెంబ‌ర్ 27, 2013న విడుద‌లైన ఈ సినిమా..నేటితో నాలుగు సంవ‌త్స‌రాల‌ను పూర్తిచేసుకుంటోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories