బ్రకోలీతో కొలెస్ట్రాల్ కి చెక్‌

బ్రకోలీతో కొలెస్ట్రాల్ కి చెక్‌
x
Highlights

బ్రకోలిలో ఎన్నో పోషకాలు ఉన్నాయి. రుచికీ రుచి ఆరోగ్యానికీ ఆరోగ్యం లభిస్తుంది. క్యాబేజీ కుటుంబానికి చెందిన ఈ కూరగాయను ఒకసారి రుచి చూసినవాళ్లు..వదలరు....

బ్రకోలిలో ఎన్నో పోషకాలు ఉన్నాయి. రుచికీ రుచి ఆరోగ్యానికీ ఆరోగ్యం లభిస్తుంది. క్యాబేజీ కుటుంబానికి చెందిన ఈ కూరగాయను ఒకసారి రుచి చూసినవాళ్లు..వదలరు. ఇంతకుముందు ఎక్కడో తప్ప దొరకని ఈ కూరగాయ ఇప్పుడు అన్ని ప్రాంతాల్లోనూ అందుబాటులో ఉంటోంది. బ్రకోలీలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.

బ్రకోలిలో రొమ్ము, గర్భాశయ కేన్సర్లు రాకుండా చేసే గుణాలు అధికంగా ఉన్నాయి. దీనిలో యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండటంతో వృద్ధాప్యాన్ని త్వరగా దరిచేరనివ్వదు. బ్రకోలి ఎముకల ఆరోగ్యానికి తోడ్పడుతుంది. అంతేకాదు ఇది కొలెస్ట్రాల్‌తోపాటు ఎలర్జీలు, కీళ్లనొప్పుల్ని తగ్గిస్తుంది. బ్రకోలి గుండె ఆరోగ్యంగా ఉంచుతుంది. దీనిలో విటమిన్లు, ఖనిజ లవణాలు సమృద్ధిగా ఉండటంతో పసిపిల్లలు, పాలిచ్చే తల్లులకు ఎంతో మంచిది. ఇది కళ్లకు, చర్మానికీ ఎంతో మేలు చేస్తుంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories