25శాతానికి పైగా ఆధార్-సిమ్ కార్డుల అనుసంధానం పూర్తి

25శాతానికి పైగా ఆధార్-సిమ్ కార్డుల అనుసంధానం పూర్తి
x
Highlights

న్యూఢిల్లీః దేశవ్యాప్తంగా 25 శాతానికి పైగా సిమ్ కార్డులను ఇప్పటివరకూ ఆధార్‌తో అనుసంధానం చేసినట్లు భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ(యూఐడీఏఐ)...

న్యూఢిల్లీః దేశవ్యాప్తంగా 25 శాతానికి పైగా సిమ్ కార్డులను ఇప్పటివరకూ ఆధార్‌తో అనుసంధానం చేసినట్లు భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ(యూఐడీఏఐ) వెల్లడించింది. అంతే దాదాపు పావు శాతానికి పైగా సిమ్ కార్డు వినియోగదారులు ఆధార్‌తో తమ నంబర్‌ను అనుసంధానం చేశారు. ఇప్పటికే టెలికాం కంపెనీలు ప్రభుత్వ ఆదేశాలను సందేశాల రూపంలో వినియోగదారులకు పంపిస్తున్న సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 2018 లోపు దేశంలోని టెలికాం వినియోగదారులందరూ తమ నంబర్లను ఆధార్‌తో అనుసంధానం చేయాలని.. లేకపోతే సేవలు నిలిపివేస్తామని కేంద్రం ఇప్పటికే హెచ్చరించింది. అయినప్పటికీ చాలామంది వినియోగదారులు అలసత్వం వహిస్తున్నారు. ఫిబ్రవరి వరకూ గడువు ఉంది కదా అని భావిస్తున్నారు. మొబైల్ నంబర్‌కు ఆధార్‌ను అనుసంధానం చేసేందుకు ఆన్‌లైన్ సదుపాయం కల్పించకపోవడంపై కొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

అయితే ఆన్‌లైన్‌లో అనుసంధానం చేసుకునే అవకాశం కల్పిస్తే కొన్ని భద్రతా సంబంధమైన సమస్యలు తలెత్తుతాయని.. అందుకే ఈ సదుపాయాన్ని కల్పించలేదని సంబంధిత అధికారి వెల్లడించారు. జులై లెక్కల ప్రకారం మన దేశంలో 128 కోట్ల మొబైల్ కనెక్షన్స్ ఉన్నట్లు తేలింది. ఇందులో 90శాతం వరకూ ప్రీపెయిడ్ కనెక్షన్సే కావడం గమనార్హం. ఇప్పటివరకూ 7.55 శాతం మంది ఎయిర్‌టెల్ యూజర్లు, 7.99 శాతం మంది ఐడియా, 4.50 శాతం మంది వొడాఫోన్, 10.78 శాతం మంది రిలయన్స్ జియో, 1.16 శాతం మంది ఎయిర్‌సెల్ యూజర్లు తమ మొబైల్ నంబర్‌ను ప్రభుత్వ ఆదేశాలానుసారం ఆధార్‌తో అనుసంధానం చేసినట్లు భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ తెలిపింది.

Show Full Article
Print Article
Next Story
More Stories