'అడ‌విదొంగ‌'కి 32 ఏళ్లు

అడ‌విదొంగ‌కి 32 ఏళ్లు
x
Highlights

చిరంజీవి కెరీర్‌ని మ‌లుపు తిప్పిన చిత్రాల‌లో 'అడ‌వి దొంగ' ఒక‌టి. కె.రాఘ‌వేంద్ర‌రావు ద‌ర్శ‌క‌త్వంలో చిరంజీవి క‌థానాయ‌కుడిగా న‌టించిన తొలి చిత్రం కూడా...

చిరంజీవి కెరీర్‌ని మ‌లుపు తిప్పిన చిత్రాల‌లో 'అడ‌వి దొంగ' ఒక‌టి. కె.రాఘ‌వేంద్ర‌రావు ద‌ర్శ‌క‌త్వంలో చిరంజీవి క‌థానాయ‌కుడిగా న‌టించిన తొలి చిత్రం కూడా ఇదే. ఈ చిత్రానికి కంటే ముందు ద‌ర్శ‌కేంద్రుడు రూపొందించిన‌ 'మోస‌గాడు', 'తిరుగులేని మ‌నిషి' చిత్రాల్లో చిరు కీల‌క పాత్ర‌లు పోషించారు. ఈ సినిమాలోని ప్ర‌థ‌మార్థం అంతా టార్జాన్ లుక్‌లో క‌నిపిస్తారు చిరు. ఆ లుక్ లో చిరు బాడీ లాంగ్వేజ్‌, హావ‌భావాలు ప్రేక్ష‌కుల‌కు కొత్త‌గా అనిపించాయి.

చిరంజీవి స‌ర‌స‌న రాధ న‌టించిన ఈ సినిమాలో శార‌ద ఓ కీల‌క పాత్ర పోషించారు. చ‌క్ర‌వ‌ర్తి స్వ‌ర‌క‌ల్ప‌న‌లో పాట‌ల‌న్నీ ఆద‌ర‌ణ పొందాయి. 'వానా వానా వంద‌నం', 'ఇది ఒక నంద‌న‌వ‌నం', 'వీర విక్ర‌మ ధీర‌దిగ్గ‌జ నీకే స్వాగ‌తాలు'..అప్ప‌ట్లో సంచ‌ల‌నం సృష్టించిన పాట‌లు. 1985లో ఇదే తేదిన విడుద‌లైన 'అడ‌విదొంగ' నేటితో 32 వ‌సంతాల‌ను పూర్తిచేసుకుంటోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories