'శ్రీ‌నివాస క‌ళ్యాణం'కి 30 ఏళ్లు

శ్రీ‌నివాస క‌ళ్యాణంకి 30 ఏళ్లు
x
Highlights

నిజ‌మైన ప్రేమ‌.. ప్రేమించేవారి సంతోషాన్ని కోరుకుంటుంది. వారి కోసం ఏమైనా చేసేలా ప్రేరేపిస్తుంది. ఇలా ఆలోచించే ఓ పాత్ర చుట్టూ తిరిగే క‌థ‌తో రూపొందిన...

నిజ‌మైన ప్రేమ‌.. ప్రేమించేవారి సంతోషాన్ని కోరుకుంటుంది. వారి కోసం ఏమైనా చేసేలా ప్రేరేపిస్తుంది. ఇలా ఆలోచించే ఓ పాత్ర చుట్టూ తిరిగే క‌థ‌తో రూపొందిన సినిమా 'శ్రీ‌నివాస క‌ళ్యాణం'. 'చిన్న‌ప్ప‌ట్నుంచి బావ శ్రీ‌నివాస్‌ని ఇష్ట‌ప‌డే స‌రోజ‌.. ప్ర‌తికూల ప‌రిస్థితుల్లో బాల్యంలోనే అత‌నికి దూర‌మైపోతుంది. తీరా పెద్ద‌య్యాక అత‌న్ని క‌లిసే స‌మ‌యంలో.. అత‌ను అప్ప‌టికే ల‌లిత అనే మ‌రో అమ్మాయితో ప్రేమ‌లో ఉన్నాడ‌ని తెలుస్తుంది. అత‌ని సంతోషం కోసం.. ప్రేమించిన అమ్మాయితోనే అత‌ని పెళ్లి జ‌రగాల‌ని త‌ను ఎవ‌రో చెప్ప‌కుండా ఉండిపోతుంది స‌రోజ‌. ల‌లిత‌కి ఈ విష‌యం తెలిసి.. శ్రీ‌నివాస్‌, స‌రోజ‌ని ఒక్క‌టి చేయాల‌నుకుంటుంది. కానీ స‌రోజ అందుకు ఒప్పుకోదు. చివ‌ర‌కి శ్రీ‌నివాస్‌, ల‌లిత క‌ళ్యాణం జ‌రిపిస్తుంది స‌రోజ.' ఇదీ మ్యూజిక‌ల్ హిట్ 'శ్రీ‌నివాస క‌ళ్యాణం' క‌థ‌.

ఆద్యంతం ఆస‌క్తిక‌రంగా న‌డిచే క‌థ‌, క‌థ‌నాల‌తో కోడి రామ‌కృష్ణ తెర‌కెక్కించిన ఈ చిత్రంలో గౌత‌మి పాత్ర‌, న‌ట‌న సినిమాకి ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌. యువ చిత్ర ప‌తాకంపై కె.మురారి నిర్మించిన ఈ అంద‌మైన ముక్కోణ‌పు ప్రేమ‌క‌థా చిత్రానికి కె.వి.మ‌హ‌దేవ‌న్ అందించిన బాణీలు మ‌రింత సొగ‌సుని తెచ్చాయి. ముఖ్యంగా 'తుమ్మెద ఓ తుమ్మెద‌', 'ఎందాకా ఎగిరేవ‌మ్మా గోరింకా' పాట‌లు అల‌రిస్తాయి. సెప్టెంబ‌ర్ 25, 1987న విడుద‌లైన 'శ్రీ‌నివాస క‌ళ్యాణం'.. నేటితో 30 వ‌సంతాల‌ను పూర్తిచేసుకుంటోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories