Four men slit transgender's throat

Four men slit transgenders throat
x
Highlights

హైద్రాబాద్‌లో దారుణం.. కోరిక తీర్చలేదని హిజ్రా గొంతు కోశాడు హైదరాబాద్‌ః భాగ్యనగరంలో దారుణం జరిగింది. తన ఇంటికి పొరుగున నివాసముంటున్న హిజ్రాను...

  • హైద్రాబాద్‌లో దారుణం.. కోరిక తీర్చలేదని హిజ్రా గొంతు కోశాడు

హైదరాబాద్‌ః భాగ్యనగరంలో దారుణం జరిగింది. తన ఇంటికి పొరుగున నివాసముంటున్న హిజ్రాను కోరిక తీర్చమంటూ ఓ వ్యక్తి బలవంతం చేశాడు. ఆమె అంగీకరించకపోవడంతో గొంతు కోసి దాడి చేశాడు. నగరంలోని బంజారాహిల్స్‌లో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. బంజారాహిల్స్‌లో సంగీత(పేరు మార్చాం) అనే 21 ఏళ్ల హిజ్రా నివాసముంటోంది. స్థానికంగా ఉండే కొందరు యువకులు ఆమెను పలు విధాలుగా దూషిస్తూ.. వేధించేవారు. ఆమె దగ్గర ఉన్న డబ్బును లాక్కుని వెళ్లేవారు. ఆమె హిజ్రా కావడంతో ఇరుగుపొరుగు వారు కూడా పట్టించుకునే వారు కాదు. సాయంత్రం 3 గంటల సమయంలో ఇంటి బయట ఉన్న ఆమెను నలుగురు యువకులు చుట్టుముట్టారు. వారిలో ఓ యువకుడు ఆమె ఇంటికి పొరుగునే నివాసముంటున్నాడు. సంగీతను కోరిక తీర్చమంటూ.. తన ఇంటికి బలవంతంగా లాక్కెళ్లేందుకు ప్రయత్నించాడు. ఆ సమయంలో ఆమెతో పాటు ఉన్న మరో హిజ్రా వారిని ప్రతిఘటించేందుకు యత్నించింది. కానీ నలుగురు మగాళ్లు దాడి చేయడంతో ఆమె కూడా ఏమీ చేయలేకపోయింది. ఆమె నిరాకరించడంతో తనతో పాటు తెచ్చుకున్న కత్తితో విచక్షణా రహితంగా గొంతు కోశాడు. చేతులపై కోసి... ఆ మృగాళ్లు పైశాచిక ఆనందం పొందారు. ఈ దాడిలో ఆమె తీవ్రంగా గాయపడింది.

రక్తపుమడుగులో పడి ఉన్న ఆమెను ఆసుపత్రికి తరలించేందుకు మిగిలిన హిజ్రాలు ప్రయత్నించారు. ఆమెను ఆటోలో ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే ఆమెకు చికిత్స చేయడానికి మూడు ఆసుపత్రులు నిరాకరించాయి. హత్యాయత్నం కేసు కావడం, పైగా బాధితురాలు హిజ్రా అవడంతో డాక్టర్లు వైద్యం చేయడానికి సుముఖత చూపలేదు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స చేసేందుకు నిరాకరించడంతో.. సంగీతను నిమ్స్‌కు తరలించారు. ఆమెకు డాక్టర్లు చికిత్సనందిస్తున్నారు. ప్రైవేట్ ఆసుపత్రులు చికిత్సకు నిరాకరించడంపై హైదరాబాద్ ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీ మెంబర్ మువ్వల చంద్రముఖి తీవ్రంగా మండిపడింది. సుప్రీం కోర్టు ఆదేశాలను ప్రైవేట్ ఆసుపత్రులు బేఖాతర్ చేస్తున్నాయని ఆరోపించింది. బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే ఓ నిందితుడిని పోలీసులు గుర్తించారు. మిగిలిన వారి కోసం గాలిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories