బర్త్‌డే పార్టీలో అత్యాచారం...ఆ వీడియోని రూ. 10లక్షలకు బేరంపెట్టిన వారి స్నేహితుడు

Submitted by arun on Sat, 06/30/2018 - 12:37
rape

విశాఖపట్టణంలో దారుణం జరిగింది. స్నేహితుల బర్త్‌డే పార్టీకెళ్లిన బీటెక్ విద్యార్థినిపై తోటి స్నేహితులు అత్యాచారం చేస్తూ వీడియో తీశారు. ఆ తర్వాత ఆ వీడియోను డబ్బులకు విక్రయించేందుకు ప్లాన్ వేశారు. పైగా, ఈ వీడియోను అడ్డుపెట్టుకుని ఆ విద్యార్థినికి నరకం చూపించారు. చివరకు బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో ఈ దారుణం వెలుగుచూసింది. ఈ కేసు వివరాలను పరిశీలిస్తే...ఆగిరిపల్లి మండలం పోతవరప్పాడు ఎన్‌ఆర్‌ఐ కళాశాల స్టూడెంట్ వంశీకృష్ణ.. గతేడాది ఓ విద్యార్థినిని తన బర్త్‌డే సెలబ్రేషన్స్‌కి ఆహ్వానించాడు. ఓ హోటల్‌లో వేడుకల కోసం ప్రత్యేకంగా గది తీసుకున్నామని చెప్పి యువతిని నమ్మించాడు. నిజమేనని నమ్మిన ఆ యువతి, హోటల్‌కి వెళ్లింది. అక్కడ ఎవరూలేరని ప్రశ్నించే లోపు.. వంశీకృష్ణ, మరో స్టూడెంట్ శివారెడ్డి బలవంతంగా యువతిపై అత్యాచారం చేశారు. ఈ ఘటన మొత్తాన్ని సెల్‌ఫోన్ చిత్రీకరించారు. ఈ విషయం ఇంట్లో చెబితే ఈ వీడియోని బయటపెడతామని బాధితురాలిని బెదించారు. ఇంతవరకు స్టోరీ బాగానే నడిచింది. అక్కడితో ఆగకుండా వీడియోను వంశీకృష్ణ తన ఫ్రెండ్స్‌కి పంపించాడు. ప్రవీణ్‌ అనే విద్యార్థి.. బాధిత యువతికి ఫోన్‌ చేసి రూ.పది లక్షలు ఇవ్వాలని లేకుంటే వీడియోని బహిర్గతం చేస్తానని బెదిరించాడు. దీంతో ఈ వ్యవహారం కాస్త ప్రిన్సిపల్‌ దృష్టికి వెళ్లింది. విద్యార్థులను, వాళ్ల పేరెంట్స్‌ని పిలిపించి మందలించి పంపించారు. సమస్య ముగిసిపోయిందని భావించిన విద్యార్థినికి కుటుంబసభ్యులు మ్యారేజ్ చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో బాధిత యువతి వీడియో వెలుగులోకి వచ్చింది. పరిస్థితి గమనించిన బాధితురాలి తండ్రి ఆగిరిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ముగ్గురు విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

English Title
3 BE students booked for raping their batchmate

MORE FROM AUTHOR

RELATED ARTICLES