రోడ్డుపై గోతుల్లో ఏపీది మొద‌టిస్థానం

Submitted by admin on Sun, 09/10/2017 - 18:46

హైదరాబాద్‌ః ఏపీని అభివృద్ధి పథంలో నడిపించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంచుకున్న దారులు గతుకులమయంగా తయారయ్యాయి. రహదారుల మీద గుంటలు, వర్షాకాలంలో వాటి వల్ల జరిగే ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా ఈ గతుకులుగుంటల రోడ్లకు సంబంధించిన లెక్కలు ఏపీ ప్రజలను మరింత భయపెడుతున్నాయి. ఇప్పటివరకూ ఏపీలో ఈ గతుకుల రోడ్లు 930 మంది చావుకు కారణమయ్యాయి. తెలంగాణలో కూడా ఇలాంటి రోడ్లపై ప్రయాణించడం వల్ల 886 మంది చనిపోయారు. స్పీడ్ బ్రేకర్లు సరిగా లేకపోవడం వల్ల ఏపీలో 2016 సంవత్సరంలోనే 201 మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఈ గణాంకాలపై తెలంగాణ రోడ్డు భద్రతా శాఖ డైరెక్టర్ కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ ఏపీలో చాలాచోట్ల గ్రామాలకు సమీపంలోనే జాతీయ రహదారులున్నాయి.

అలాంటి చోట్ల స్పీడ్ బ్రేకర్స్ దెబ్బ తింటే.. సమీప గ్రామ ప్రజలు వాటిని బాగు చేసుకుంటున్నారని చెప్పారు. అయినప్పటికీ ఇలాంటి ప్రమాదాలు జరగడం దురదృష్టకరమన్నారు. తెలంగాణలో ఈ తరహా ప్రమాదాల బారిన పడిన వారిలో 549 ప్రాణాలను కాపాడగలిగామని.. ఎప్పటికప్పుడు రోడ్లను బాగుచేస్తున్నామని ఆయన చెప్పారు. ఇదిలా ఉంటే, ఏపీలో పలు చోట్ల రోడ్ల దుస్థితి అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. సీఎం చంద్రబాబు కూడా ఈ విషయంపై సీరియస్‌గా దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.

English Title
In South India, Andhra Pradesh tops in pothole mishaps

MORE FROM AUTHOR

RELATED ARTICLES