నల్లులు డైనోసార్ల రక్తమూ తాగాయట!

నల్లులు డైనోసార్ల రక్తమూ తాగాయట!
x
Highlights

నల్లులు .. వీటి గురించి తెలీని వారు.. వాటి బారిన పడని వారూ దాదాపు ఉండరు. అవి మనిషి రక్తమే ఆహారంగా బతుకుతాయి. మంచం కోళ్ల మూలల్లో, పరుపుల్లో, తలుపు...

నల్లులు .. వీటి గురించి తెలీని వారు.. వాటి బారిన పడని వారూ దాదాపు ఉండరు. అవి మనిషి రక్తమే ఆహారంగా బతుకుతాయి. మంచం కోళ్ల మూలల్లో, పరుపుల్లో, తలుపు సందుల్లో నక్కి ఉండి రాత్రుళ్ళు నరకం చూపిస్తాయి. అత్యంత వేగంగా ఇవి విస్తరిస్తాయి. ఒక ఆడ నల్లి వేలాది నల్లులను కనగలదు. ఆహారం లేకుండా కూడా ఇది నెల రోజులు బతకగలదు. నల్లుల గురించి చాలా పరిశోధనలు జరిగాయి. ఇవి 5 కోట్ల సంవత్సరాల క్రితం పుట్టాయని ఇప్పటివరకూ నమ్ముతూ వచ్చారు. అయితే, తాజా పరిశోధనల్లో ఇవి ఇంకా ముందు నుంచే ఉన్నాయని తెలిసిందట. దాదాపు పది కోట్ల సంవత్సరాల క్రితమే నల్లి జాతి అవతరించిందని పరిశోధకులు తేల్చారు. యూకేలోని యూనివర్సిటీ ఆఫ్ షెఫీల్డ్ శాస్త్రవేత్తలు ప్రపంచవ్యాప్తంగా వీటి అవశేషాలను సేకరించి 15 ఏళ్ల పాటు పరీక్షలు చేయగా డైనోసార్ల కాలంలోనే వీటి మనుగడ ప్రారంభమైనట్లు తేలిందట. డాక్టర్ స్టీఫెన్ రోథ్ అనే శాస్త్రవేత్త మాట్లాడుతూ.. 'తొలి క్షీరదంగా భావిస్తున్న గబ్బిలం కంటే ముందే భూమ్మీదకు నల్లులు వచ్చాయని తమ పరిశోధనల్లో తేలడంతో షాక్ తిన్నాం. అవి ఇప్పటికీ భూమ్మీద బతుకుతున్నాయంటే ఆశ్చర్యమే' అని తెలిపారు.ఈ నల్లులు డైనోసార్ల రక్తం కూడా పీల్చి ఉండవచ్చని వారు వెల్లడించారు. అప్పట్లో వీటితో పాటు ఉన్న జీవులన్నీ దాదాపు కనుమరుగైపోయాయి. డైనోసార్లు అసలు చరిత్రగా మిగిలిపోయాయి. కానీ నల్లులు ఇంకా మనుగడ సాగిస్తుండడంతో పరిశోధకులు ఆశ్చర్యపోతున్నారు.

నల్లులు(బెడ్ బగ్స్).. మన రక్తాన్ని పీల్చే పురుగు. పరుపులలో, అరల లోపల, గోడల సందులో, ఇంటి మూలల్లో ఉంటూ.. రాత్రి పూట నరకం చూపించే కీటకాలు ఇవి. ఒక్కసారి మన చర్మానికి పట్టిందా.. పీల్చి పిప్పి చేసే వరకు వదలదు. ప్రపంచంలో ఎక్కడికెళ్లినా వీటి బెడద ఉంటోంది. ఇవి ఇప్పుడిప్పుడే భూమ్మీదకు రాలేదట. ట్రిసియల్ కాలంలో భూమిని శాసించిన డైనోసార్ల కాలంలోనే ఇవి పుట్టాయట. ఇప్పటి వరకు నల్లులు 5 కోట్ల ఏళ్ల సంవత్సరాల క్రితమే పుట్టాయని నమ్ముతూ వచ్చాం. కానీ, 10 కోట్ల ఏళ్ల క్రితమే అవి పుట్టాయని తాజాగా శాస్త్రవేత్తలు తేల్చారు. యూకేలోని యూనివర్సిటీ ఆఫ్ షెఫీల్డ్ శాస్త్రవేత్తలు ప్రపంచవ్యాప్తంగా వీటి అవశేషాలను సేకరించి 15 ఏళ్ల పాటు పరీక్షలు చేయగా డైనోసార్ల కాలంలోనే వీటి మనుగడ ప్రారంభమైనట్లు తేలిందట. డాక్టర్ స్టీఫెన్ రోథ్ అనే శాస్త్రవేత్త మాట్లాడుతూ.. 'తొలి క్షీరదంగా భావిస్తున్న గబ్బిలం కంటే ముందే భూమ్మీదకు నల్లులు వచ్చాయని తమ పరిశోధనల్లో తేలడంతో షాక్ తిన్నాం. అవి ఇప్పటికీ భూమ్మీద బతుకుతున్నాయంటే ఆశ్చర్యమే' అని తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories