బరిలో నిలిచేదెవరు? తప్పుకునేదెవరు?

బరిలో నిలిచేదెవరు? తప్పుకునేదెవరు?
x
Highlights

సంక్రాంతి వస్తోందంటే సినీ అభిమానులకు పండగే. మంచి కంటెంట్ ఉంటే.. ఆ సీజన్‌లో మూడు నాలుగు సినిమాలు వచ్చినా హిట్ చేసేంత విశాల హృదయం ఉంటుంది వారికి. ఇక తమ...

సంక్రాంతి వస్తోందంటే సినీ అభిమానులకు పండగే. మంచి కంటెంట్ ఉంటే.. ఆ సీజన్‌లో మూడు నాలుగు సినిమాలు వచ్చినా హిట్ చేసేంత విశాల హృదయం ఉంటుంది వారికి. ఇక తమ అభిమాన కథానాయుకుల సినిమాలు వస్తున్నాయంటే ఆ ఆసక్తి మరింత ఎక్కువగా ఉంటుంది. వారికే కాదు.. అగ్ర కథానాయుకులకి కూడా తమ సినిమాలను సంక్రాంతికి తీసుకురావాలని ఉంటుంది. ఎందుకంటే.. సంక్రాంతికి పోటీ ఎంత ఉన్నా ఆదరణకు లోటు ఉండదన్నది వారి ఆలోచన. అలాగే ‘సంక్రాంతి కథానాయుకుడు’ అని పిలిపించుకోవాలని ఎవరికి మాత్రం ఉండదు? ఇక, 2018 సంక్రాంతికి అయితే ఏకంగా నలుగురు అగ్ర కథానాయుకుల సినిమాలు వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఆ నలుగురు అగ్ర కథానాయుకులు ఎవరంటే.. బాలకృష్ణ, పవన్ కల్యాణ్, మహేష్‌బాబు, రాంచరణ్.

వీరికి సంక్రాంతి కొత్త కాదు
బాలకృష్ణకి సంక్రాంతి బాగా అచ్చొచ్చిన పండగ. ‘పెద్దన్నయ్య’, స‌మ‌ర సింహారెడ్డి, ‘నరసింహనాయుడు’, ‘లక్ష్మీ నరసింహా’ నుంచి గత సంక్రాంతికి వచ్చిన ఆయన వందో చిత్రం ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ వరకు ఎన్నో సంక్రాంతి విజయాలు ఆయన ఖాతాలో ఉన్నాయి. అభిమానులు కూడా ఆయన్ని ‘సంక్రాంతి హీరో’గానే పిలుచుకుంటారు. ప్రస్తుతం బాలయ్య నటిస్తున్న కొత్త చిత్రం కూడా సంక్రాంతికే రానుందని సమాచారం. కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని జనవరి 12న రిలీజ్ చేయనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. మరో అగ్ర కథానాయుకుడు పవన్ కల్యాణ్‌కి సంక్రాంతి సీజన్ కొత్తేమీ కాదు. ఇది వరకు ‘బాలు’, ‘గోపాల గోపాల’ చిత్రాలు సంక్రాంతి సందర్భంలోనే వచ్చాయి. ఇప్పుడు ఆయన నటిస్తున్న 25వ చిత్రం కూడా సంక్రాంతికే ప్రేక్షకుల ముందుకు రానుంది. జనవరి 10న విడుదల కానున్న ఈ చిత్రానికి త్రివిక్రమ్ దర్శకుడు. ‘జల్సా’, ‘అత్తారింటికి దారేది’ తరువాత పవన్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమాకి ‘అజ్ఞాత వాసి’ అనే పేరు వినిపిస్తోంది. ఈ సంక్రాంతికి రానున్న మరో అగ్ర కథానాయుకుడు మహేష్ బాబు. ‘ఒక్కడు’, ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ వంటి ఘనవిజయాలను ఈ సీజన్‌లోనే అందుకున్నారాయన. ‘శ్రీమంతుడు’ తరువాత కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్న ‘భరత్ అను నేను’ని కూడా ఇదే సవుయంలో విడుదల చేయాలన్న ఆలోచనతో మహేష్ ఉన్నారు. అన్నీ కుదిరితే ఈ చిత్రం జనవరి 11న ప్రేక్షకుల ముందుకు రావచ్చు. అలాగే ‘నాయక్’, ‘ఎవడు’ చిత్రాలతో సంక్రాంతి విజయాలను అందుకున్న రాంచరణ్ కూడా తన తాజా చిత్రం ‘రంగస్థలం’తో ఆ సీజన్‌లో సందడి చేసే అవకాశం కనిపిస్తోంది.

ఇదే మొదటిసారి కాదు:ఇద్దరు లేదా అంతకుమించి పెద్ద హీరోల సినిమాలు
సంక్రాంతికి రావడం ఇదే మొదటి సారి కాదు. గతంలోనూ ఇలాంటి సందర్భాలున్నాయి. గత 20 సంవత్సరాల్లో ఈ పరిస్థితిని గవునిస్తే.. 1997లో చిరంజీవి ‘హిట్లర్’, బాలకృష్ణ ‘పెద్దన్నయ్య’, వెంకటేష్ ‘చిన్నబ్బాయ్’ సంక్రాంతికే సందడి చేశాయి. వీటిలో మొదటి రెండు సినిమాలు విజయం సాధించాయి. అలాగే 2000లో చిరంజీవి ‘అన్నయ్య’, బాలకృష్ణ ‘వంశోద్ధారకుడు’, వెంకటేష్ ‘కలిసుందాం..రా’, మోహన్‌బాబు ‘పోస్ట్‌మేన్’ వచ్చాయి. వీటిలో ‘అన్నయ్య’, ‘కలిసుందాం..రా’ విజయం సాధించాయి. అలాగే 2001లో చిరంజీవి ‘మృగరాజు’, బాలకృష్ణ ‘నరసింహనాయుడు’, వెంకటేష్ ‘దేవీపుత్రుడు’ రిలీజయ్యాయి. వీటిలో ‘నరసింహనాయుడు’ ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. 2002లో బాలకృష్ణ ‘సీవుసింహం’, మహేష్ ‘టక్కరిదొంగ’ వస్తే రెండూ ఆశించిన విజయం సాధించలేదు. ఇక 2003లో మహేష్ ‘ఒక్కడు’, ఎన్టీఆర్ ‘నాగ’ రిలీజైతే.. ‘ఒక్కడు’ ఘనవిజయం సాధించింది. అలాగే 2004లో చిరంజీవి ‘అంజి’, బాలకృష్ణ ‘లక్ష్మీ నరసింహా’ విడుదలైతే.. ‘లక్ష్మీ నరసింహా’ హిట్ అయ్యింది. ఇక 2005లో పవన్ కల్యాణ్ ‘బాలు’, ఎన్టీఆర్ ‘నా అల్లుడు’ సందడి చేస్తే.. రెండూ విజయాన్ని అందుకోలేకపోయాయి. అదేవిధంగా 2007లో అల్లు అర్జున్ ‘దేశముదురు’, ప్రభాస్ ‘యోగి’ సంక్రాంతి సవుయంలో విడుదైలెతే.. ‘దేశముదురు’ సక్సెస్ అయ్యింది. ఇక 2008లో బాలకృష్ణ ‘ఒక్క మగాడు’, రవితేజ ‘కృష్ణ’ ప్రేక్షకుల ముందుకు వస్తే.. ‘కృష్ణ’ని విజయం వరించింది.

2010లో మూడు పెద్ద హీరోల సినిమాలు వచ్చాయి. అవే వెంకటేష్ ‘నమో వెంకటేశ’, ఎన్టీఆర్ ‘అదుర్స్’, రవితేజ ‘శంభో శివ శంభో’. వీటిలో ‘అదుర్స్’ మాత్రమే బాక్సాఫీస్ వద్ద విజేతగా నిలిచింది. 2011లో బాలకృష్ణ ‘పరవువీర చక్ర’, రవితేజ ‘మిరపకాయ్’ సిల్వర్‌స్క్రీన్‌పై సందడి చేయగా.. రెండో సినిమా హిట్ అనిపించుకుంది. 2012లో వెంకటేష్ ‘బాడీగార్డ్’, మహేష్‌బాబు ‘బిజినెస్‌వేున్’ సంక్రాంతికి రాగా.. ‘బిజినెస్‌వేున్’ వర్కవుట్ అయ్యింది. అదేవిధంగా 2013లో వచ్చిన రెండు పెద్ద సినిమాలు ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’, ‘నాయుక్’ మంచి విజయం సాధించాయి. ఇక 2014లో మహేష్ ‘1-నేనొక్కడినే’, చరణ్ ‘ఎవడు’ విడుదల కాగా.. రెండో సినిమా సక్సెస్ అయ్యింది. 2016లో బాలకృష్ణ ‘డిక్టేటర్’, నాగార్జున ‘సోగ్గాడే చిన్ని నాయనా’, ఎన్టీఆర్ ‘నాన్నకు ప్రేమతో’ చిత్రాలు విడుదలయ్యాయి. వీటిలో ‘సోగ్గాడే..’ సూపర్ హిట్ అయితే, ‘నాన్నకు ప్రేమతో’ హిట్ అనిపించుకుంది. ‘డిక్టేటర్’ కూడా ఫరవాలేదనిపించుకుంది. ఇక ఈ ఏడాదిలో వచ్చిన చిరంజీవి 150వ చిత్రం ‘ఖైదీ నెం.150’, బాలకృష్ణ 100వ చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణి కూడా ఘన విజయం సాధించాయి. ఈ నేపథ్యంలో 2018లోనూ నాలుగు పెద్ద సినిమాలు రానుండడం మరింత ఆసక్తిని పెంచుతోంది.

ఈ నాలుగు చిత్రాలూ సంక్రాంతికి వచ్చినా.. లేదంటే ఏ రెండో విడుదైలెనా.. కంటెంట్ ఉంటేనే సినిమాకి విజయం ఖాయం. చాలా సందర్భాల్లో పెద్ద సినిమాలతో పాటు చిన్న సినిమాలు వచ్చి ఊహించని రీతిలో బ్లాక్‌బస్టర్ అయిన సందర్బాలు కూడా ఉన్నాయంటే.. దానికి కారణం కంటెంట్ ఈజ్ కింగ్ కాబట్టే. మరి సంక్రాంతి బరిలో దిగనున్న ఈ పందెం కోళ్ళల్లో ఎవరు పక్కాగా వస్తారో, ఎవరు విజేతగా నిలుస్తారో తెలియాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే.

ఏది ముందు? ఏది తరువాత?:
ఈ సంక్రాంతికి నాలుగు పెద్ద సినిమాలు వచ్చే అవకాశమున్నా.. పవన్ సినిమాని మినహాయిస్తే అధికారకంగా ఏ సినిమా విడుద‌ల ఖ‌రారు కాలేదు. బాలకృష్ణ, మహేష్‌బాబు సినిమాలు ఈ మధ్యే ప్రారంభమ‌య్యాయి. అయితే ఆయా సినిమాల డైరెక్టర్లకి ఉన్న ట్రాక్ రికార్డ్ ప్రకారం సంక్రాంతికి సినిమాలు వచ్చినా ఆశ్చర్యపడనవసరం లేదు. అయితే ఎటొచ్చి కాస్త గందరగోళానికి గురిచేస్తున్నది మాత్రం రాంచరణ్, సుకుమార్ కాంబినేషన్‌లో వస్తున్న రంగస్థలం. ఈ సినిమాని సంక్రాంతికి తీసుకువస్తున్నామని ఆ మధ్య అధికారకంగా చిత్రబృందం పేర్కొన్నా.. అదే టైంలో పవన్ సినిమా కూడా రానుందని న్యూస్ రావడంతో డిసెంబర్‌లోనే రంగస్థలం వచ్చే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి. తాజాగా మార్చి నెలాఖరులో లేదా ఏప్రిల్‌కి సినిమా వాయిదా పడిందని కథనాలు వచ్చాయి. కాదు.. సంక్రాంతికే అంటూ మళ్లీ వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే యూనిట్ నుంచి ఏ విషయం తెలియురాలేదు. సుకుమార్ తన సినిమాలకు ఎక్కువ సమ‌యమే కేటాయిస్తారు కాబట్టి సమ్మర్‌కే రంగస్థలం రావచ్చని టాలీవుడ్ వర్గాలు భావిస్తున్నాయి. ఏదేైమెనా.. రంగస్థలం విడుదల విషయంలో అభిమానుల నుంచి సగటు ప్రేక్షకుల వరకు కన్ఫ్యూజన్ కొనసాగుతూనే ఉంది. మరో పక్క మహేష్, కొరటాల శివ సినిమా సంక్రాంతికి వచ్చే అవకాశం లేదని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ‘రంగస్థలం చిత్రాన్ని పండగకే వదులుతారని వార్తలు వినిపిస్తున్నాయి. పవన్‌కళ్యాణ్ సినిమా కంటే వారం ముందు ఈ చిత్రాన్ని రిలీజ్ చెయ్యాలనుకుంటున్నారు. ఒకవేళ మహేష్ మనసు మార్చుకొని సంక్రాంతికి వస్తే రంగస్థలం సమ్మర్‌కి వెళ్ళడం ఖాయంగా కనిపిస్తోంది. భరత్ అను నేను చిత్రానికి సంబందించిన మేజర్ పార్ట్ షూటింగ్ ఇంకా బ్యాలెన్స్ వుంది. కాబట్టి సంక్రాంతికి వచ్చే ఛాన్సే లేదని మరో వార్త కూడా బయటికి వచ్చింది. మరి ఈ రెండు సినిమాల్లో ఏది పండగకి వస్తుందో, ఏది సమ్మర్‌కి వెళ్తుందో చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories