విశాఖ వేదికగా సన్ రైజర్స్- ఢిల్లీ అమీతుమీ

విశాఖ వేదికగా సన్ రైజర్స్- ఢిల్లీ  అమీతుమీ
x
Highlights

వైజాగ్ వేదికగా ఈరోజు హైదరాబాద్, ఢిల్లీ మధ్య ఎలిమినేటర్ మ్యాచ్‌ జరగనుంది . అదృష్టం కొద్ది లీగ్ దశ నుండి ప్లే ఆఫ్ కి చేరుకుంది సన్ రైజర్స్. ఇక మొదటి...

వైజాగ్ వేదికగా ఈరోజు హైదరాబాద్, ఢిల్లీ మధ్య ఎలిమినేటర్ మ్యాచ్‌ జరగనుంది . అదృష్టం కొద్ది లీగ్ దశ నుండి ప్లే ఆఫ్ కి చేరుకుంది సన్ రైజర్స్. ఇక మొదటి నుండి మంచి అట కనబరిచి ప్లే ఆఫ్ లో చోటు సంపాదించుకుంది ఢిల్లీ . ఇరు జట్లు కూడా మంచి పటిష్టంగా ఉన్నట్టు కనిపిస్తున్నాయి .. ఎక్కువ ఎడ్జ్ మాత్రం సన్ రైజర్స్ కి మాత్రమే ఉందని చెప్పవచ్చు . కానీ ఐపిఎల్ లో ఎప్పుడు ఎం టీం నేగ్గుతుందో చెప్పలేం . ప్రతి మ్యాచ్ చివరి బంతి వరకు ఉత్కంట గానే సాగుతుంది ..

ఒక్కసారి ఇరు జట్ల బలబాలలు పరిశీలిచినట్లు అయితే సన్ రైజర్స్ కి బాట్స్ మెన్స్ అతి పెద్ద బలం .. ముందునుండి జట్టు విజయంలో బాట్స్ మెన్స్ దే హవా.! కెప్టన్ విలియమ్సన్‌ కి తోడు మంచి ఫామ్‌లో ఉన్న మనీష్‌ పాండే, మహ్మద్‌ నబి, రషీద్‌ ఖాన్‌లపై సన్‌రైజర్స్‌ ఆధారపడింది .. లీగ్ దశలో జట్టు విజయంలో కీలక పాత్రలు పోషించిన వార్నర్‌, బెయిర్‌స్టో ప్రస్తుతం జట్టులో లేకపోవడం కలవరపెట్టే అంశంగా చెప్పుకోవచ్చు .. ఇక బౌలింగ్ విభాగంలో స్పిన్నర్లు నబి, రషీద్‌ ఖాన్‌ తమ బౌలింగ్ తో మ్యాజిక్ చేస్తే ఢిల్లీ బాట్స్ మెన్స్ ని కట్టడి చేయొచ్చు ..

ఇక ఢిల్లీ విషయానికి వచ్చేసరికి ఢిల్లీ ప్లే ఆఫ్ కి చేరుకోవడం అనేది ముందుగా గర్వించదగ్గ విషయంగా చెప్పవచ్చు. ఎందుకంటే ఎప్పుడు పాయింట్ల పట్టికలో చివర్లో ఉండే ఢిల్లీ మంచి విజయాలను సాధిస్తూ ప్లే ఆఫ్ కి చేరింది .. చివరగా 2012లో ఢిల్లీ ప్లే ఆఫ్ కి చేరింది . ఇక ఢిల్లీ బ్యాటింగ్‌లో శిఖర్ ధావన్ , రిషబ్‌ పంత్‌, శ్రేయస్‌ అయ్యర్‌ గొప్పగా రాణిస్తున్నారు . ఇక టోర్నమెంట్ లో అత్యదిక వికెట్లు తీసిన బౌలర్ గా కాగిసో రబాడ (25 వికెట్లు) ఈ మ్యాచ్ కి దూరం కావడం అ జట్టుకు పెద్ద లోటే . ఢిల్లీ చివరి ఐదు లీగ్ మ్యాచ్ లో కేవలం ఒక్కటి మాత్రమే ఓడిపోయింది .. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు శుక్రవారం వైజాగ్‌లోనే చెన్నై సూపర్ కింగ్స్‌తో రెండో క్వాలిఫయర్ మ్యాచ్ ఆడనుండగా.. ఓడిన జట్టు టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories