సంచిలో తాబేళ్లు.. యువతి ప్యాంటు జేబులో మొసలి

సంచిలో తాబేళ్లు.. యువతి ప్యాంటు జేబులో మొసలి
x
Highlights

ఆడపిల్లలు జేబులో ఎం ఉంచుకుంటారు. ఓ చేతిరుమాలు.. చాక్లెట్లు.. ఇంకా అయితే ఓ లిప్ స్టిక్ లాంటి మేకప్ సామాను. అంతే కదా! అలా అనుకుంటే, మీరు తప్పకుండా ఈ...

ఆడపిల్లలు జేబులో ఎం ఉంచుకుంటారు. ఓ చేతిరుమాలు.. చాక్లెట్లు.. ఇంకా అయితే ఓ లిప్ స్టిక్ లాంటి మేకప్ సామాను. అంతే కదా! అలా అనుకుంటే, మీరు తప్పకుండా ఈ విశేషం తెలుసుకోవాల్సిందే!

అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలోని పుంటా గోర్డా ప్రాంతంలో పోలీసులు సాధారణ తనిఖీలు నిర్వహిస్తున్నారు. వచ్చే పోయే వాహనాలను ఆపి పరిశీలిస్తున్నారు. ఇంతలో ఓ యువకుడు, యువతి వెళుతున్న ట్రక్కు వచ్చింది. దానిని కుడా ఆపి తనిఖి చేసారు. అందులో ఉన్న జీవుల్ని చూసి షాక్ తిన్నారు. ట్రక్కు లో ఏరియల్ మైకెల్ అనే యువతి, మైకెల్ కోడీ క్లెమన్స్ అనే వ్యక్తి ప్రయాణం చేస్తున్నారు. వారు తాము కప్పలను, పాములను పట్టడానికి వెళ్తున్నట్టు పోలీసులకు చెప్పారు. దీంతో ట్రక్కు ను క్షుణ్ణం గా పరిశీలించారు. ఆ యువతి వద్ద ఉన్న ఓ సంచిలో నలభై త్రీ స్ట్రైప్డ్ తాబేళ్ల పిల్లలు పోలీసులకు కనిపించాయి. ఇవి సరే ఇంకా ఏమన్నా ఉన్నాయా అని పోలీసులు ప్రశ్నిస్తే సదరు యువతి తన జేబులోనుంచి మొసలిని బయటకు తీసింది. దీంతో పోలీసులకు మతిపోయింది. వెంటనే కేసును ఫ్లోరిడా ఫిష్ అండ్ వైల్డ్‌లైఫ్ కన్జర్వేషన్ కమిషన్‌కు అప్పగించి హమ్మయ్య అని ఊపిరి తీసుకున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories