వెలుగులోకి వాకాటి నారాయణ ఆర్దిక సామ్రాజ్యం

వెలుగులోకి వాకాటి నారాయణ ఆర్దిక సామ్రాజ్యం
x
Highlights

పేరుకు పెద్ద మనుషులు.. అడుగుడునా ఆర్దిక అవకతవకలు.. వాటన్నింటిని కప్పి పుచ్చుకునేందుకు రాజకీయ ముసుగులు.. చట్టాలు చేతిలోకి తెచ్చుకునేందుకు ప్రజా...

పేరుకు పెద్ద మనుషులు.. అడుగుడునా ఆర్దిక అవకతవకలు.. వాటన్నింటిని కప్పి పుచ్చుకునేందుకు రాజకీయ ముసుగులు.. చట్టాలు చేతిలోకి తెచ్చుకునేందుకు ప్రజా ప్రాతినిధ్యాలు.. ఎన్నికల కోసం అడ్డగోలు సొమ్ములను అప్పనంగా ఖర్చు చేయడాలు.. ఆరా తీస్తే అన్నింటా మోసాలు.. మొన్నటి విజయ్ మాల్యా నుంచి తాజాగా వెలుగులోకి వచ్చిన నెల్లూరు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ వాకాటి నారాయణ రెడ్డి వరకు పెద్దల ఆర్దిక వ్యవహారాల్లో అంతర్యాలు వెలుగు చూస్తున్నాయి.

బఢా నేతలతో పోటోలు.. అక్రమాలకు సక్రమన్నట్లు ప్రజా ప్రాతినిధ్యాలు.. ఆపై అందిన మేరకు ఆర్దిక సంస్థలను కొల్లగొట్టడాలు..సీబీఐ అభియోగాలతో ఆర్దిక నేరాల వ్యవహారాల్లో అరెస్టు అయిన వాకాటి నారాయణ రెడ్డి వ్యవహారమిది.. ఈయనొక్కరే కాదు.. ఆరా తీస్తే ప్రజాప్రాతినిధ్యాన్నే పరమావధిగా అధికార పార్టీనే అండదండలుగా ఆర్దిక నేరాలకు పాల్పడ్డవారి నేరాలు నెల్లూరు జిల్లాలో ఒక్కొక్కటిగా వెలుగు చేూస్తున్నాయి.

ఉన్నదికాస్తైనా లేని ఆస్తులు ఉన్నట్లు లెక్కలు చూపారన్న సీబీఐ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ వాకాటి నారాయణ ఆర్దిక సామ్రాజ్యం విస్తారమైందే.. విఎన్ ఆర్ గ్రూపు పేరుతో నిర్మాణాలు,పవర్ ప్రాజెక్టులు, పరిశోదనా పరిశీలన విభాగాలు, వాకాటి ఇన్ ప్రా, వాకాటి కన్ స్ట్రక్షన్స్ ఇలా అనేక ఆర్దిక సంస్థలు విభాగాలు విఎన్ ఆర్ గ్రూపులో అంతర్బాగాలు.. దేశ వ్యాప్తంగా రైల్వే, హైవే, పవర్ సహా అనేక అంతర్జాతీయ సంస్థలతో విఎన్ ఆర్ గ్రూపుకు ఒప్పందాలున్నాయి.. గత వైఎస్సార్ హయాంలో జలయజ్ణంలోనూ ఆ పై నెల్లూరు జిల్లాలోని కిష్ణపట్నం రోడ్డు, రైల్వై లైన్ల నిర్మాణాలను ఈ సంస్థే చేపట్టింది.. దేశవ్యాప్తంగా కార్యాలయాలు, అనుబంధ సంస్థలపై విస్తరించిన విఎన్ ఆర్ గ్రూపు ఆర్దిక మాంద్యం దెబ్బకు కుదేలైది. అప్పులు పెరిగాయి.. ఆర్దిక పురోగతి మందగించింది.. దీంతో భారీ రుణాలు తీసుకోక తప్పలేదు ఆ సంస్థకు..

విస్తారంగా కంపెనీ పెరిగిపోతుందన్న సమయంలోనే ఆర్దిక ఒడిదుడుకులు మొదలయ్యాయి.. ఇదే సమయంలో వాకాటి ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎంటరయ్యారు.. ఒకప్పటి దివంగత ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి శిష్యుడిగా డైరెక్ట్ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన వాకాటి ఆ తర్వాత అధికార రాజకీయాలే హద్దుగా మారుతున్న రాజకీయ సమీకరణల్లో ఎత్తులకు పై ఎత్తులు వేశారు.. జనార్దన్ రెడ్డి అనంతరం డాక్టర్ రాజశేఖర్ రెడ్డి పంచన చేరారు.. ఆ సమయంలోనే నెల్లూరు సెంట్రల్ బ్యాంకు చైర్మన్ గా, అనంతరం రెండు దఫాలు స్ఝానిక సంస్థల ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు.. ఇదే సమయంలో కంపెనీ నష్టాలపాలైంది.

వ్యాపార లావాదేవీలు కోసమంటూ ఐ ఎఫ్ సి ఐ నుంచి రూ.180 కోట్లు రుణం తీసుకుంది వాకాటి సంస్థైన విఎన్ ఆర్.. అందుకు కోసం శామిర్ పేటలో ఉండే రూ.12 కెట్ల స్థలాన్ని రూ.180 కోట్లుగా చూపింది.. తక్కువ ఆస్తులను ఎక్కువగా చూపి బ్యాంక్ లను మోసం చేసినట్లు వాకాటి పై గతంలో అభియోగాలు మోపిందిసీబీఐ.. దీంతో ఇవాళ బెంగుళూరుకు విచారణకు పిలిచి అరెస్టు చేశారు.. పెద్ద ఎత్తున బ్యాంక్ లను మోసం చేసినట్లుగా అభియోగాలు

బ్యాంకులకు మోసాలు, రుణాల ఎగవేతలాంటి ఆర్థిక నేరాల పై గతంలోనే వాకాటి ఇల్లు, సంస్థల్లో సీబీఐ సోదాలు చేసింది.. ఇవాళ అరెస్టు చేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories