జనసేనలోకి 20 మంది ఎమ్మెల్యేలు!

Submitted by arun on Sat, 08/25/2018 - 07:35
Janasena

‘ఆంధ్రప్రదేశ్‌లో 20 మంది ఎమ్మెల్యేలు మా పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారు.. ఇప్పటికే వారంతా పవన్‌ కల్యాణ్‌తో చర్చించారు. ఆయన నిర్ణయం తీసుకున్నాక తేదీ ఖరారు చేసి వారిని పార్టీలోకి ఆహ్వానిస్తాం’ అని జనసేన రాష్ట్ర కన్వీనర్‌ వి.పార్థసారథి వెల్లడించారు. నిన్న రాజమండ్రిలో ఆయన మాట్లాడుతూ త్వరలోనే అనేక మంది ముఖ్యులు జనసేనలో చేరబోతున్నారని తెలిపారు. రాష్ట్ర  మేనిఫెస్టోతోపాటు 175 నియోజకవర్గాలకు మైక్రో మేనిఫెస్టో రూపొందిస్తామని ఆయన చెప్పారు. ప్రతి జిల్లాకు 25 మందితో.. తర్వాత నియోజకవర్గాలలో 25మందితో కమిటిలు వేసే ప్రక్రియ మొదలైందని పార్థసారథి వివరించారు. టికెట్ల కేటీయింపులో మహిళలకు ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు.   
 

English Title
20 mlas to Join in Janasena

MORE FROM AUTHOR

RELATED ARTICLES