దేశంలోని వివిధ పార్టీల నగదు వివరాలు..

దేశంలోని వివిధ పార్టీల నగదు వివరాలు..
x
Highlights

ఆయా పార్టీలు ఎన్నికల సంఘానికి అందించిన నివేదికల ద్వారా మాయావతి నేతృత్వంలోని బహుజన్‌ సమాజ్‌ పార్టీ రూ.669 కోట్ల నిధులు కలిగివుంది. దేశ రాజధానిలోని...

ఆయా పార్టీలు ఎన్నికల సంఘానికి అందించిన నివేదికల ద్వారా మాయావతి నేతృత్వంలోని బహుజన్‌ సమాజ్‌ పార్టీ రూ.669 కోట్ల నిధులు కలిగివుంది. దేశ రాజధానిలోని ప్రభుత్వ రంగ బ్యాంకుల్లోని పార్టీకి చెందిన 8 ఖాతాల్లో రూ.669 కోట్ల నిధులు ఉన్నట్టు వెల్లడైంది. అలాగే రూ.95.54 లక్షలు నగదు రూపంలో కూడా ఉన్నట్లు తెలిపింది. ఇదంతా విరాళాల ద్వారానే సేకరించినట్లు బీఎస్‌పీ పేర్కొందని అధికారులు వెల్లడించారు.

ఆ తరువాతి స్థానంలో రూ.471 కోట్ల నిల్వలతో సమాజ్‌వాదీ పార్టీ, రూ.196 కోట్లతో మూడో స్థానంలో కాంగ్రెస్, రూ.107 కోట్లున్న తెలుగుదేశం పార్టీ నాలుగో స్థానంలో ఉంది. ఇక ఐదో స్థానంలో అధికార బీజేపీ ఉంది. ఆయా పార్టీలు ఆదాయ పన్ను రిటర్నుల్లో చూపిన వివరాలను అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రిఫార్మ్స్‌(ఏడీఆర్‌) విశ్లేషించింది. 2016–17, 2017–18 సంవత్సరాల్లో బీజేపీ అత్యధికంగా రూ.1,034 కోట్లు, అదేవిధంగా, 2016–17లో కాంగ్రెస్‌ ఆదాయం రూ.225 కోట్లుగా ఉంది. తర్వాతి ఆర్థిక సంవత్సరంలో ఆ పార్టీ ఈసీకి ఆదాయ వివరాలను అందజేయలేదు. సీపీఎం ఆదాయం గత కొన్నేళ్లుగా రూ.100 కోట్లుగా ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories