నిజ నిర్థారణ కమిటీ వేసిన వైఎస్‌ జగన్‌

నిజ నిర్థారణ కమిటీ వేసిన వైఎస్‌ జగన్‌
x
Highlights

ఈ నెల 11వ తేదిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమరం ముగిసింది. ఇక ఫలితాలపైనే అందరి దృష్టి. అయితే ఎన్నికల్లో మాత్రం తీవ్రఉదృతల మధ్య ముగిసింది. వైసీపీ, టీడీపీ...

ఈ నెల 11వ తేదిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమరం ముగిసింది. ఇక ఫలితాలపైనే అందరి దృష్టి. అయితే ఎన్నికల్లో మాత్రం తీవ్రఉదృతల మధ్య ముగిసింది. వైసీపీ, టీడీపీ శ్రేణుల మధ్య ఘర్షనలో ఇద్దరు మృతి చెందిన విషయం తెలసిందే. అక్కడక్కడ గొడవలు కాస్తా చిలికి చిలికి గాలి వానల మారిన విషయం తెలిసిందే. కాగా ఈ నేపథ్యంలో గుంటూరు జిల్లాలోని గురజాల, సత్తెనపల్లి, నరసరావుపేట అసెంబ్లీ నియోజక వర్గాల పరిధిలో అధికార పార్టీ టీడీపీ పార్టీ శ్రేణుల దాడులు, అరాచకాలు, దౌర్జన్యాలపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిజనిర్ధారణ కమిటీని నియమించారు. కాగా ఈ కమిటీ పై మూడు నియోజక వర్గాలలో పర్యటించి ఆయా గ్రామాల్లో దాడులపై వాస్తవాలు తెలుసుకోవడంతోపాటు, దాడుల్లో గాయపడిన, నష్టపోయిన వారికి వైసీపీ పార్టీ అండగా నిలుస్తోందని భరోసా ఇవ్వనున్నారు. టీడీపీ పార్టీ చేసిన దాడికి సంబంధించి ఈ కమిటీ బాధితులను నేరుగా కలిసి వాస్తవాలను తెలుసుకుంటారు. ఆ తర్వాత సమగ్ర నివేదికను పార్టీ అధ్యక్షుడికి సమర్పిస్తుంది.

అయితే ఈ కమిటికి మర్రి రాజశేఖర్‌ నేతృత్వం వహించనుండగా కమిటీలో శ్రీ కష్ణదేవరాయలు, అంబటి రాంబాబు, కాసు మహేశ్, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, జంగా కృష్ణమూర్తి, మహమ్మద్‌ ఇక్బాల్, ముస్తఫా, అంజాద్‌ భాషా, నవాజ్‌ సభ్యులుగా ఉన్నారు. కాగా మరోవైపు వైసీపీ నేతలు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, బొత్స సత్యనారాయణ, అంబటి రాంబాబు నేటి (ఆదివారం) రాత్రి ఏడు గంటలకు గుంటూరు ఎస్పీని కలిసి టీడీపీ వర్గీయుల దాడులపై ఫిర్యాదు చేయనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories