తమిళనాడు జల్లికట్టు పోటీల్లో చిందిన రక్తం

Submitted by arun on Mon, 01/15/2018 - 17:25
 jallikattu

తమిళనాడు సంప్రదాయ క్రీడ జల్లికట్టులో రక్తం చిందింది. మధురైలో నిర్వహించిన జకట్టు పోటీల్లో జనం పెద్దఎత్తున పాల్గొన్నారు. పొగరు మీదున్న ఎద్దులను నియంత్రించేందుకు యువత పోటీపడ్డారు. నువ్వానేనా అంటూ వందలాది మంది యువకులు.... ఎద్దులతో కుస్తీపడ్డారు. పొగరుతో దూసుకొస్తున్న ఎద్దులను తమ బలంతో పడగొట్టేందుకు తొడగొట్టారు. కానీ ఎద్దుల పొగరు ముందు యువకులు నిలబడలేకపోయారు. బుల్స్‌ అన్నీ బుల్‌డోజర్లలాగా దూసుకుపోవడంతో ఓ యువకుడు మరణించాడు. మరో 45మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుల్లో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడ్డవారంతా మధురై ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

English Title
19-Year-Old Killed in Jallikattu

MORE FROM AUTHOR

RELATED ARTICLES