వింత వివాహాం.. ముగ్గురు యువతులను పెళ్లి చేసుకున్న మరో యువతి

Submitted by arun on Tue, 12/26/2017 - 14:32

కడప జిల్లా జమ్మలమడుగులో నమ్మలేని నిజం ఒకటి బయటపడింది. అది వింటే మిమ్మల్ని మీరే కొన్ని నిమిషాల పాటు నమ్మలేరు. నమ్మేందుకు ఎంత ట్రై చేసినా మీ మనసు ఒప్పుకోదు. అసలు ఇలాంటి వాళ్లు కూడా ఉంటారా అని మిమ్మల్ని మీరే ఒకటికి పది సార్లు ప్రశ్నించుకుంటారు.

ముందు ఆ నిజమేంటో చెప్పండి టెన్షన్‌తో చచ్చిపోతున్నాం అని మీరనుకుంటున్నా తెలిశాక మాత్రం టెన్షన్ ఫ్రీ అయిపోతారు. భుజంపై టవల్ వేసుకొని అమాయకంగా కనిపిస్తున్న అమ్మాయిదే ఈ కేసులో కీ రోల్. అమ్మాయా అని అవాక్కవకండి. అచ్చం అబ్బాయిలా ఉన్నా అచ్చు గుద్దిన అమ్మాయే ఈమె. 18 ఏళ్ల రమాదేవి ఏకంగా ముగ్గురు అమ్మాయిలను పెళ్లి చేసుకొని సంచలనం సృష్టించింది.

కడప జిల్లా కాశినాయన మండలం ఇటుకలపాడు గ్రామానికి చెందిన రమాదేవి పులివెందులలోని ఓ కాటన్‌మిల్లులో పనిచేస్తోంది. అక్కడే జమ్మలమడుగు నియోజకవర్గంలోని భీమగుండం గ్రామానికి చెందిన మౌనిక అనే మరో యువతి కూడా పనిచేస్తోంది. అక్కడే వీరి పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఆ తర్వాత ఇద్దరూ పెళ్లి చేసుకున్నట్లు చెప్తున్నారు. 

ఐతే మౌనికతో పెళ్లికి ముందే రమాదేవి వందన, బుజ్జి అనే మరో ఇద్దరు అమ్మాయిలను కూడా పెళ్లి చేసుకునట్లు చెప్తోంది. వాళ్ల పేరెంట్స్ వచ్చి వాళ్లిద్దరినీ తీసుకెళ్లినట్లు తెలిపింది. మౌనిక పెళ్లి చేసుకుందన్న విషయం తెలిసిన ఆమె తల్లిదండ్రులు జమ్మలమడుగు డీఎస్పీని కలిసి ఫిర్యాదు చేశారు. 18 ఏళ్ల వయసుకే ఒక అమ్మాయి అయి ఉండి మరో ముగ్గురు అమ్మాయిలను ఎందుకు పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందన్న దానిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.

English Title
18 year old girl married three ladies

MORE FROM AUTHOR

RELATED ARTICLES