జనసేన వైఫల్యానికి కారణాలు ఇవే ..

జనసేన వైఫల్యానికి కారణాలు ఇవే ..
x
Highlights

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో చిత్తూ చిత్తుగా ఓడిపోయిది జనసేన ..ఒక్క సీటు మాత్రమే గెలుచుకుంది . అ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా రెండు చోట్లల్లో...

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో చిత్తూ చిత్తుగా ఓడిపోయిది జనసేన ..ఒక్క సీటు మాత్రమే గెలుచుకుంది . అ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా రెండు చోట్లల్లో ఓడిపోయారు .. 2014 ఎన్నికలకు ముందు పార్టీని స్థాపించిన పవన్ పోటి మాత్రం చేయకుండా టిడిపి పార్టీకి మద్దతు ఇచ్చారు . ఇక అప్పుడప్పుడు ట్వీట్టర్లో సందేశాలు ఇస్తూ తన సినిమాలో బీజిగా ఉన్నారు పవన్ .. ఈ క్రమంలో తనపైన ఎన్నో విమర్శలు వచ్చిన అయన మాత్రం స్పందించలేదు .. అ తర్వాత బీజేపిని విమర్శిస్తూనే టిడిపికి దూరం అవుకుంటూ వచ్చారు ..

పవన్ పార్టీ పెట్టకముందే రాజకీయాల్లో ఉన్నారు . అయన అన్నయ్య చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో ఉన్నప్పుడే అయన ప్రత్యేక్ష రాజకీయాలోకి వచ్చారు కానీ అయన రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించింది మాత్రం కేవలం పది నెలల ముందే .. పార్టీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా గుంటూరులో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభ ద్వారా పవన్ పూర్తిస్థాయి రాజకీయ నాయకుడిగా మారాడని చెప్పాలి ..

అంతకుముందు టిడిపికి ఏకపక్షంగా మద్దతు పలికిన పవన్ ఒక్కసారిగా టిడిపిపై విమర్శలదాడికి దిగారు .. ఏకంగా చంద్రబాబు తనయుడు నారా లోకేష్ పైనే అవీనితి ఆరోపణలు చేసి సంచలనం సృష్టించారు పవన్.. ఇక ఏడాది పాటు అయన పార్టీని ప్రజల్లోకి తిసుకేల్లెందుకు బాగానే శ్రమించారు .. కానీ జనసేనకి భారీ ఓటమి తప్పలేదు .. అభ్యర్దుల గెలుపు ఓటముల విషయం పక్కన పెడితే అయనే పోటి చేసిన రెండు చోట్ల ఓడిపోయారు .. దీనితో జనసేన ఓడిపోవడానికి గల కారణాల గురించి ప్రతి ఒక్కరు చర్చించుకుంటున్నారు ..

1. జనసేన పార్టీకి ఉన్న ప్రధాన లోపం పార్టీ నిర్మాణం .. పార్టీని ముందు క్షేత్రస్థాయి నుండి ముందుకు తీసుకువెళ్ళాలి .. అది జనసేనలో మనకి ఎక్కడ కూడా కనిపించదు .. అదే పార్టీని నిలువున ముంచింది ..

2. ఇక ఓటింగ్ విషయానికి వచ్చేసరికి జనసేన పార్టీకి అసలైన అభ్యర్దులు లేకపోవడం మరో ప్రధాన కారణంగా చెప్పవచ్చు .. ఎందుకంటే పవన్ కళ్యాణ్ కి ఓటు వేయడం వేరు పవన్ చూపించిన అభ్యర్దికి ఓటు వేయడం వేరు .. ఎన్నికల్లో పోటి చేసే ముందు అభ్యర్ది ప్రజలకు తెలిసి ఉండడం మంచిది కానీ జనసేన చివరి నిమిషం లోనే అభ్యర్దులను ప్రకటించింది ..

3. ఇక జనసేన పార్టీలో గుర్తింపు ఉన్న నేతలు ఎవరు లేరు .. పెట్టిన ప్రతి సభలో పవన్ తప్ప మరెవరు మాట్లాడరు. ఇది కూడా మరో కారణంగా చెప్పవచ్చు ..

4. వైసీపీ ఇంతటి ఘనవిజయం సాధించడానికి టిడిపి పై ఉన్న వ్యతిరేకతనే ప్రధాన కారణమని తెలిసిపోతుంది దాన్ని వైసీపీ చక్కగా ఉపయోగించుకుంటే జనసేన పూర్తిగా విఫలం అయింది . దీనికి కారణం లేకపోలేదు . వైసీపీ అంతగా విమర్శిస్తుంటే పవన్ మాత్రం సైలెంట్ అయిపోయారు .. దీనితో టిడిపికి మరియు జనసేనకి మద్య అంతర్గత ఒప్పందం నడుస్తుందన్న టాక్ జనాల్లోకి బలంగా వెళ్ళిపోయింది .. దిన్ని పవన్ ఎక్కడకూడా కొట్టిపారేయలేదు

5. జనసేన అధినేత కంటే పవన్ కి హీరోగా మంచి ఫాలోయింగ్ ఉంది . ఇటు యూత్ అటు సామజీకవర్గం నుండి పవన్ కి ఆశించిన ఫలితాలు రాబట్టుకోవడంలో కూడా పవన్ పూర్తిగా విఫలం అయ్యారు ..

ఇప్పుడు నియోజకవర్గ అభ్యర్దిగా, పార్టీ అధినేతగా పవన్ ఓడిపోయారు . ఇప్పుడు మళ్లీ ఎన్నికలు రావాలంటే మళ్లీ ఐదు సంవత్సరాలు ఆగక తప్పదు .. అప్పటి వరకు పవన్ తన క్యాడర్ ని జెండాని ఎక్కడ కూడా తగ్గకుండా చూసుకోవాలి. ప్రజల మధ్యే ఉంటూ ప్రజల సమస్యను తెలుసుకుంటూ ముందుకు వెళ్తే పవన్ అధికారంలోకి రావడం పెద్ద పనేం కాదు ..

Show Full Article
Print Article
Next Story
More Stories