చెన్నై నగరంలో ఘోరం..

చెన్నై నగరంలో ఘోరం..
x
Highlights

తమిళనాడు చెన్నై నగరంలో ఘోరం జరిగింది. ప్రేమ పేరుతో బాలికను లోబరచుకున్న ఓ యువకుడు నయవంచన చేశాడు. పుదుచ్చేరికి సమీపంలోని ఓ గ్రామానికి చెందిన కార్మికుని...

తమిళనాడు చెన్నై నగరంలో ఘోరం జరిగింది. ప్రేమ పేరుతో బాలికను లోబరచుకున్న ఓ యువకుడు నయవంచన చేశాడు. పుదుచ్చేరికి సమీపంలోని ఓ గ్రామానికి చెందిన కార్మికుని కుమార్తె (17) చెన్నై నగరంలో చిన్న చిన్న పనులు చేసుకుంటూ కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉంటోంది. ఈ క్రమంలో ఆమెకు విల్లుపురం జిల్లా వళుతావూరుకు చెందిన ఒక యువకుడు పరిచయం అయ్యాడు. కొద్దీ కాలానికే వారిమధ్య సాన్నిహిత్యం ఏర్పడింది. మాయమాటలు చెప్పి, ఆమెపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు ఆ యువకుడు. అంతేకాకుండా తన ఆరుగురు స్నేహితులకు బాలికను అప్పగించగా వారూ కూడా రేప్ చేశారు. విషయం తెలుసుకున్న బాలిక తల్లిదండ్రులు బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories